ఎమ్మెల్యే కాటసానిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం: నోటీసుల నిరాకరణపై సీరియస్

By narsimha lode  |  First Published Jan 20, 2022, 4:40 PM IST

కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. కోర్టు నోటీసులు కూడా ఎందుకు తీసుకోరని ప్రశ్నించింది.


అమరావతి:Kurnool జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన పిటిషన్ విషయంలో ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

న్యాయస్థానం నోటీసులు ఇచ్చినా విషయం తెలిసి కూడా ఎందుకు  స్పందించలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 4న ఇచ్చిన ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని వేసిన అనుబంధ పిటిషన్  పై విచారణ జరపాలని katasani Rambhupal Reddy తరపున వేసిన అనుబంధ పిటిషన్ పై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ పై Ap High Court తీవ్రంగా స్పందించింది.

Latest Videos

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. Mla అయి  ఉండి అందుబాటులో లేకుండా నోటీసులు అందుకోకపోతే News papers లలోపేరు ప్రచురించేందుకు ఆదేశించకుండా ఏం చేయాలని హైకోర్టు ప్రశ్నించింది.

కోర్టు ఇచ్చిన నోటీసులను ఎలా నిరాకరిస్తారని అడిగింది.  ప్రజా ప్రతినిధిగా ఉన్న మీరే నోటీసులు నిరాకరిస్తారా అని అడిగింది.

గతంలో Ttd సభ్యులుగా నియమితులైన వారందరికీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  అయితే  ఆ సమయంలో ఎమ్మెల్యే కొడుకు వివాహం ఉందన్నారు. నోటీసుపై స్పందించనందుకు గాను కోర్టుకు ఎమ్మెల్యే తరపున ఆయన న్యాయవాది క్షమాపణలు కోరారు.

 నోటీసులు జారీ చేసిన విషయం తెలిసి కూడా స్పందించకపోవడంపై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలపై గౌరవం లేని వ్యక్తి టీటీడీ సభ్యుడిగా దేవాలయం పట్ల భక్తితో ఎలా ఉంటారని కోర్టు వ్యాఖ్యానించింది. టీటీడీ పాలకమండలిలో 28 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం

 గతంలో జీవో 245 జారీ చేసింది. అంతేకాదు మరో 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియమిస్తూ ఇచ్చిన జీవోలు 568, 569 జీవోలు జారీ చేసింది.ఈ జీవోలను సవాల్ చేస్తూ  బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. క్రిమినల్‌ కేసులు, అధికార పార్టీతో రాజకీయ సంబంధాలు ఉన్న వ్యక్తులను బోర్డు సభ్యులుగా నియమించారని ఆ పిల్ లో ఆరోపించారు. ఈ పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఈ పిల్‌కు సంబంధించి నోటీసులు అందుకోని సభ్యులపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఇలా కోర్టు నోటీసులిచ్చిన విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ పాలక మండలి విషయం వివాదా స్పదమైంది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. 

click me!