టీటీడీలో పనిచేస్తున్న 12 మంది అర్చకులు కరోనా బారినపడ్డారు. గత ఏడాదిలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడ అర్చకులు కరోనా బారినపడ్డారు. అప్పట్లో కరోనా భయానికి కొన్ని రోజుల పాటు ఆలయాలను కూడా మూసివేశారు.
తిరుమల: టీటీడీలో పనిచేస్తున్న 12 మంది అర్చకులు కరోనా బారినపడ్డారు. గత ఏడాదిలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడ అర్చకులు కరోనా బారినపడ్డారు. అప్పట్లో కరోనా భయానికి కొన్ని రోజుల పాటు ఆలయాలను కూడా మూసివేశారు.టీటీడీలోని ఉద్యోగులు, సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 4 వేల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.మిగిలినవారికి కూడ వ్యాక్సినేషన్ చేయించనున్నారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.బుధవారం నాడు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడ పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వ్యాక్సినేషన్ ను అందించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఇటీవలనే అధికారులను ఆదేశించారు.