కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 12 మంది ఆచూకీ లేదు: మంత్రి గుడివాడ

By narsimha lodeFirst Published Jun 4, 2023, 10:51 AM IST
Highlights

కోరమండల్ ఎక్స్ ప్రెస్  ప్రమాదంలో ఏపీకి  చెందిన వారు ఒకరు మృతి చెందినట్టుగా మంత్రి  గుడివాడ అమర్ నాథ్  చెప్పారు.


బాలాసోర్: కోరమండల్  రైలు ప్రమాదంలో  ఏపీకి చెందిన 12 మంది  నుండి సమాచారం  లేదని  ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్  చెప్పారు.కోరమండల్  ఎక్స్ ప్రెస్  రైలు,  యశ్వంత్ పూర్- హౌరా  రైళ్లలో  ఎక్కువగా  తెలుగు  ప్రయాణీకులు  ప్రయాణం చేస్తుంటారని  మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుర్తు  చేశారు.  ఆదివారంనాడు  ఒడిశా  బాలాసోర్ లో ఆయన  మీడియాతో మాట్లాడారు. కోరమండల్, యశ్వంత్ పూర్-హౌరా  రైలులో 342 మంది  తెలుగు  ప్రయాణీకులున్నారు. వీరిలో  331 మంది  ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అమర్ నాథ్  ప్రకటించారు.  

ఈ ప్రమాదంలో  శ్రీకాకుళం  జిల్లా  జగన్నాథపురానికి చెందిన  గురుమూర్తి అనే వ్యక్తి  మృతి చెందాడు.  గురుమూర్తి ఒడిశాలో  స్థిరపడ్డాడు.  ఏపీలో  పెన్షన్ తీసుకొని తిరుగు ప్రయాణంలో  ప్రమాదానికి గురై మరణించినట్టుగా  మంత్రి తెలిపారు. గురుమూర్తి  మృతదేహన్ని  కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా   మంత్రి అమర్ నాథ్  వివరించారు. 

ఈ ప్రమాదంలో  గాయపడిన  11 మందికి  ఆయా ఆసుపత్రుల్లో  చికిత్స అందిస్తున్నట్టుగా  మంత్రి అమర్ నాథ్  తెలిపారు.  మరో వైపు  ఇంకా  12 మంది  గురించిన సమాచారం తెలియాల్సి ఉందని  మంత్రి  అమర్ నాథ్ తెలిపారు.  ఈ రైలు ప్రమాదానికి సంంబంధించిన సమాచారం తెలిపే కంట్రోల్  రూమ్ లకు  కూడా  ఎలాంటి సమాచారం  రాలేదని మంత్రి  తెలిపారు.  అయితే  ఈ 12 మంది గురించి  సమాచారం సేకరిస్తున్నామని మంత్రి  గుడివాడ అమర్ నాథ్  చెప్పారు.  ఈ ప్రమాదంలో ఏపీకి  చెందిన వారు ఉండకూడదని  దేవుడిని ప్రార్ధిస్తున్నామని  మంత్రి అమర్ నాథ్  తెలిపారు.

also read:కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం: కొనసాగుతున్న ట్రాక్ మరమ్మత్తు పనులు
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి  వైద్య సహాయం  కోసం  10 అంబులెన్స్ ను ఏర్పాటు  చేశార. మరో వైపు  10 మహాప్రస్థానాలను  కూడా  సిద్దం చేశారు. బాలాసోర్ లో  మూడు అంబులెన్స్ లను  సిద్దం  చేశారు. రైలు  ప్రమాద మృతులకు సంబంధించిన ఫోటోలను  ఒడిశా, కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు  చేరవేసింది.  మృతుల వివరాలను గుర్తించే పనిలో  ఆయా రాష్ట్రాలున్నాయి.  మృతి చెందినవారిలో 254 మందిని గుర్తించారు.  గుర్తించిన మృతదేహల్లో  74 డెడ్ బాడీలను  కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 

click me!