అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు కీలక భేటీ.. దేని గురించి చర్చించారంటే..? 

By Rajesh KarampooriFirst Published Jun 4, 2023, 5:13 AM IST
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్‌ షా నివాసంలో జేపీ నడ్డా షాను కలిశారు.
 

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే.. రాజకీయాలు వేడేక్కాయి. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రతిపక్షలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అప్పుడూ సిద్దంగా ఉండాలని పార్టీ నేతలతో పాటు.. ప్రతి పక్ష నాయకులు కూడా సమయత్నం అవుతున్నారు. ఈ తరుణంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు  నాయుడు ఢిల్లీ పర్యటన చర్చనీయంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు  నాయుడు  భేటీ సమవేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షాను భేటీ అయ్యారు. 

కానీ,  బాబు తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీతో టీడీపీ పొత్తలపై చర్చించడానికి వెళ్లరాని, ఈ అంశంపైనే వారి మధ్య చర్చ జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బీజేపీ పొత్తు కోసం టీడీపీ చాలాకాలంగా రాయబారాలు నడుపుతోందని సమాచారం. ఇటీవల కాలంలో టీడీపీ అధినేత, బీజేపీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ సమయంలో ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అలాగే.. జీ20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. మరోసారి ప్రధానితో  సమావేశమయ్యారు. 

తాజాగా ఇప్పుడు జేపీ నడ్డా, అమిత్ షాతో  చంద్రబాబు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నారనే పలు సంకేతాలు వెలువడుతున్నాయి. వీరితో పాటు బీజేపీని కలుపుకుపోవాలని ఈ రెండు పార్టీ అధినాయత్వాలు .. కమలం నేతలతో వరుసగా భేటీలు అవుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే, శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీలను నెరవేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన జగన్.. ఆయన కేసులు ఉండటంతో కేంద్రంతో లాలూచీ పడుతున్నారని  విమర్శించారు. జగన్ వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని మండిపడ్డారు. 

click me!