యూకే నుండి ఏపీకి 1423 మంది, 12 మందికి కరోనా: ఒకరికి స్ట్రెయిన్

By narsimha lode  |  First Published Dec 29, 2020, 6:05 PM IST

యూకే నుండి  ఏపీకి వచ్చిన 1423 మంది వచ్చినట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.  యూకే నుండి వచ్చిన వారికి 12 మందికి కరోనా సోకింది. అయితే రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ సోకింది.
 


అమరావతి: యూకే నుండి  ఏపీకి వచ్చిన 1423 మంది వచ్చినట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.  యూకే నుండి వచ్చిన వారికి 12 మందికి కరోనా సోకింది. అయితే రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ సోకింది.

బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్  వైరస్ ను గుర్తించారు. స్ట్రెయిన్ వైరస్ ప్రపంచాన్ణి వణికిస్తోంది. ఇండియాలో కూడ ఆరు కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. 

Latest Videos

ఏపీలో ఒక్క కేసు నమోదైంది. తెలంగాణలో రెండు కేసులు నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు.

యూకే నుండి వచ్చిన 1423 మందిలో ఇప్పటికే 1406 మందిని గుర్తించారు. ఇంకా 17 మందిని గుర్తించారు.  ఈ 1423 మందితో 6364 మంది కాంటాక్టు అయినట్టుగా  అధికారులు గుర్తించారు.

also read:స్ట్రెయిన్ కలకలం: యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు కోవిడ్

యూకే నుండి వచ్చిన వారిలో ఒక్కరికే స్ట్రెయిన్ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో స్ట్రెయిన్ వైరస్ రాష్ట్రంలో నమోదు కావడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

స్ట్రెయిన్ వైరస్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  ఏపీ వైద్య ఆరోగ్య శాఖాధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
 

click me!