ఏపీలో నిలకడగానే కరోనా: కొత్తగా 1,179 మందికి పాజిటివ్, 20,37,813కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 21, 2021, 05:11 PM IST
ఏపీలో నిలకడగానే కరోనా: కొత్తగా 1,179 మందికి పాజిటివ్, 20,37,813కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,179 కరోనా కేసులు నమోదవ్వగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,651 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,089 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,179 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,37,813కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,089కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, ప్రకాశం 2, చిత్తూరు 3, నెల్లూరు 2, తూర్పుగోదావరి, గుంటూరులలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,651 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,09,819కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 49,737 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,78,13,498కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,089 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 8, చిత్తూరు 190, తూర్పుగోదావరి 192, గుంటూరు 107, కడప 30, కృష్ణ 167, కర్నూలు 2, నెల్లూరు 131, ప్రకాశం 124, శ్రీకాకుళం 19, విశాఖపట్నం 47, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 161 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu