అటెన్షన్ ఏపీ: ఒక్కరోజులో 11 వేలకు పైగా కేసులు .. పెరుగుతున్న మరణాలు, చిత్తూరులో తీవ్రత

Siva Kodati |  
Published : Apr 23, 2021, 07:03 PM IST
అటెన్షన్ ఏపీ: ఒక్కరోజులో 11 వేలకు పైగా కేసులు .. పెరుగుతున్న మరణాలు, చిత్తూరులో తీవ్రత

సారాంశం

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌ ప్రారంభమైన నుంచి తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 11 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,766 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌ ప్రారంభమైన నుంచి తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 11 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,766 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,09,228కి చేరుకున్నాయి.

నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,579కి చేరింది.  కోవిడ్ వల్ల నెల్లూరు 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, కృష్ణ 4, కర్నూలు 4, ప్రకాశం 4, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 3, గుంటూరు 2, విజయనగరంలలో ఇద్దరు చొప్పున మరణించారు.

గడిచిన 24 గంటల్లో 4,441 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,27,418కి చేరుకున్నాయి. ప్రస్తుం ఆంధ్రప్రదేశ్‌లో 74,231 యాక్టీవ్ కేసులు వున్నాయి. నిన్న ఒక్కరోజు 45,581 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,58,80,750కి చేరుకున్నాయి.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 1,201, చిత్తూరు 1,885, తూర్పుగోదావరి 796, గుంటూరు  1,593, కడప 361, కృష్ణ 831, కర్నూలు 1,180, నెల్లూరు 949, ప్రకాశం 370, శ్రీకాకుళం 1,052, విశాఖపట్నం 910, విజయనగరం 448, పశ్చిమ గోదావరిలలో 190 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu