ఏపీ: 24 గంటల్లో 1174 మందికి పాజిటివ్... 20,34,458కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 18, 2021, 05:42 PM ISTUpdated : Sep 18, 2021, 05:43 PM IST
ఏపీ: 24 గంటల్లో 1174 మందికి పాజిటివ్... 20,34,458కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,309 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,653 మంది చికిత్స పొందుతున్నారు.   

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,174 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,34,458కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,061కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరు 3, కృష్ణ 1, ప్రకాశం 1, కడప 1, చిత్తూరు 2, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,309 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,05,744కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 55,525 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,76,52,514కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,653మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 18, చిత్తూరు 159, తూర్పుగోదావరి 208, గుంటూరు 131, కడప 69, కృష్ణ 140, కర్నూలు 5, నెల్లూరు 122, ప్రకాశం 161, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 55, విజయనగరం 10, పశ్చిమ గోదావరిలలో 80 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

మార్కాపురం ప్రమాదంపై మంత్రుల ప్రెస్ మీట్ | Markapuram Bus Incident | Asianet News Telugu
అసెంబ్లీ లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Powerful Speech in Assembly