ఏపీ: కొత్తగా 1,171 మందికి పాజిటివ్‌.. 20,40,349కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 23, 2021, 07:50 PM IST
ఏపీ: కొత్తగా 1,171 మందికి పాజిటివ్‌.. 20,40,349కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,171 కరోనా కేసులు నమోదవ్వగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,207 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,749 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,171 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,40,349కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,108కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, చిత్తూరు 3, నెల్లూరు 3, ప్రకాశం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,207 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,12,492కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 55,251 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,79,25,469కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,749 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 6, చిత్తూరు 158, తూర్పుగోదావరి 255, గుంటూరు 101, కడప 48, కృష్ణ 147, కర్నూలు 7, నెల్లూరు 145, ప్రకాశం 141, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 45, విజయనగరం 15, పశ్చిమ గోదావరిలలో 94 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్