కరోనా దెబ్బ: కుటుంబ పోషణకు కూరగాయలు విక్రయిస్తున్న 11 ఏళ్ల బాలుడు

By narsimha lodeFirst Published Aug 21, 2020, 12:38 PM IST
Highlights

అనంతపురం జిల్లాలోని గుత్తి గాంధీనగర్ కు  చెందిన 11 ఏళ్ల బాలుడు కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. తండ్రి అకాల మరణంతో కుటుంబ భారాన్ని ఆ బాలుడు తన భుజాలపైకి ఎత్తుకొన్నాడు. 

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తి గాంధీనగర్ కు  చెందిన 11 ఏళ్ల బాలుడు కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. తండ్రి అకాల మరణంతో కుటుంబ భారాన్ని ఆ బాలుడు తన భుజాలపైకి ఎత్తుకొన్నాడు. 

అనంతపురం జిల్లా గుత్తి గాంధీనగర్ కాలనీకి చెందిన వెంకటేష్, సుజాత దంపతులకు  యశోద, వెంకటలక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ అనే ఐదుగురు సంతానం. వెంకటేష్ తన కుటుంబాన్ని పోషించేందుకు కూలీ చేసేవాడు. అయితే ఆరేళ్ల క్రితం వెంకటేష్ అనారోగ్యంతో మరణించాడు. వెంకటేష్ భార్య సుజాతపై కుటుంబ పోషన భారం పడింది.

కూలీ పనులు చేస్తూ సుజాత ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసింది. కొంత కాలం నుండి ఆర్ధిక కష్టాలు వెంటాడాయి. పూట గడవడం కూడ కష్టంగా మారింది.దీంతో చిన్నవాడైన సుదర్శన్ కుటుంబ భారాన్ని తీసుకొన్నాడు. తల్లికి చేదోడు వాదోడుగా పనులు చేస్తున్నాడు. 

గత మూడేళ్లుగా సుదర్శన్ తల్లితో పాటు పనులు చేస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించేందుకు గాను సుజాత టిఫిన్ చేసేది. ఆ టిఫిన్ ను సుదర్శన్ ఇల్లిల్లూ తిరుగుతూ విక్రయించేవాడు. దోశలు, ఇడ్లీలు, వడలు గ్రామంలో  విక్రయించేవాడు. ఉదయం పూట టిపిన్ విక్రయించేవాడు. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లేవాడు. 

కరోనాతో గత ఐదు మాసాలుగా ఆ కుటుంబానికి ఇబ్బందులు  వచ్చాయి.  టిఫిన్ ను విక్రయించే పరిస్థితులు లేకపోయాయి. దీంతో మరోసారి ఈ కుటుంబానికి  కష్టాలు మొదలయ్యాయి. దీంతో టిఫిన్ కు బదులుగా కూరగాయలను విక్రయించడం ప్రారంభించాడు సుదర్శన్. 

ప్రతి రోజూ ఉదయం పూట సైకిల్ పై కూరగాయలు, ఆకుకూరలను విక్రయిస్తున్నాడు. ప్రతి రోజూ కనీసం రూ. 150 నుండి రూ. 200 సంపాదిస్తున్నాడు. సుదర్శన్ కోట ప్రభుత్వ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. 
 

click me!