రంగంపేటలో కరోనా కలకలం: అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా

By narsimha lode  |  First Published Jul 27, 2020, 7:49 PM IST

చిత్తూరు జిల్లాలోని ఎ.రంగంపేటలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా సోకింది. ఈ ఘటనతో గ్రామస్తుల భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.


చిత్తూరు:  చిత్తూరు జిల్లాలోని ఎ.రంగంపేటలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా సోకింది. ఈ ఘటనతో గ్రామస్తుల భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.

also read:ఏపీలో కొనసాగుతున్న కరోనా జోరు: 1,02,349కి చేరిన కేసులు

Latest Videos

undefined

రంగంపేట గ్రామంలో ఇటీవల కాలంలో ఓ వ్యక్తి మరణించాడు. డెడ్‌బాడీకి కరోనా టెస్టులు నిర్వహించలేదు. అయితే చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలుసుకోకుండా అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే ఈ అంత్యక్రియలు నిర్వహించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది.  అంతేకాదు ఈ గ్రామానికి చెందిన మరో నలుగురు గ్రామస్తులకు కూడ కరోనా సోకింది. గ్రామంలో 11 మందికి ఒకే సారి కరోనా సోకడంతో గ్రామస్థుల్లో భయంతో పరీక్షలకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

మృతదేహాలకు కూడ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కరోనా లక్షణాలు కన్పించకపోవడంతో ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే కొంప ముంచిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రంలో సోమవారం నాటికి లక్ష కరోనా కేసులు దాటాయి. చిత్తూరులో ఇప్పటివరకు 7809 కేసులు రికార్దయ్యాయి. కరోనాతో జిల్లాలో 84  మంది మరణించారు.

click me!