ఏపీలో తగ్గుతున్న కేసులు: కొత్తగా 10,413.. దారికొస్తున్న మరణాలు, చిత్తూరులో అదే తీవ్రత

Siva Kodati |  
Published : Jun 04, 2021, 05:19 PM IST
ఏపీలో తగ్గుతున్న కేసులు: కొత్తగా 10,413.. దారికొస్తున్న మరణాలు, చిత్తూరులో అదే తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ కూడా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,413 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ కూడా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,413 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,38,990కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,296కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 7, చిత్తూరు 14, గుంటూరు 6, కర్నూలు 5, నెల్లూరు 4, కృష్ణ 6, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 11, ప్రకాశం 3, కడపలో ఒకరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 15,469 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 15,93,921కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 85,311 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,96,19,590కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,33,773 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 865, చిత్తూరు 1574, తూర్పుగోదావరి 2075, గుంటూరు 686, కడప 610, కృష్ణ 692, కర్నూలు 425, నెల్లూరు 527, ప్రకాశం 631, శ్రీకాకుళం 427, విశాఖపట్నం 634, విజయనగరం 293, పశ్చిమ గోదావరిలలో 974 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడలో రైతుల అకౌంట్ లోకి నేరుగా నిధులు జమ చేసిన పవన్| Asianet News Telugu