ఏపీ కరోనా అప్‌డేట్: కొత్తగా 10,199 కేసులు.. 75 మరణాలు

Siva Kodati |  
Published : Sep 03, 2020, 06:10 PM ISTUpdated : Sep 03, 2020, 06:15 PM IST
ఏపీ కరోనా అప్‌డేట్: కొత్తగా 10,199 కేసులు.. 75 మరణాలు

సారాంశం

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,65,730కి చేరింది.

కోవిడ్ కారణంగా నిన్న ఒక్క రోజే 75 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,200కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9,499 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 3,57,829కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలో 1,03,701 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 62,225 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 39,05,775కి చేరుకుంది.

నిన్న ఒక్క రోజే అనంతపురం 854, చిత్తూరు 885, తూర్పు గోదావరి 1090, గుంటూరు 805, కడప 898, కృష్ణ 318, కర్నూలు 616, నెల్లూరు 982, ప్రకాశం 926, శ్రీకాకుళం 717, విశాఖపట్నం 695, విజయనగరంలలో 836 కేసులు చోటు చేసుకున్నాయి.

అలాగే గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి 10, చిత్తూరు 9, గుంటూరు 9, అనంతపురం 7, కృష్ణ 7, పశ్చిమ గోదావరి 7, నెల్లూరు 6, కడప 5, కర్నూలు 4, శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖపట్నం 2, విజయనగరంలలో ఇద్దరు చొప్పున మరణించారు. 

 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu
Republic Day Celebrations in Amaravati: గణతంత్ర వేడుకల్లో ఏపీ పోలీస్ కవాతు| Asianet News Telugu