ఏపీ: 24 గంటల్లో 586 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,56,813కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Oct 15, 2021, 06:29 PM IST
ఏపీ: 24 గంటల్లో 586 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,56,813కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 586 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 712 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 6,543 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 586 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,56,813కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,295కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు 3, ప్రకాశం 3, కృష్ణా 2, నెల్లూరులో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 712 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,36,065 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 44,946 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,89,24,891కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 6,453 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 6, చిత్తూరు 119, తూర్పుగోదావరి 99, గుంటూరు 89, కడప 26, కృష్ణ 66, కర్నూలు 5, నెల్లూరు 46, ప్రకాశం 45, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 47, విజయనగరం 6, పశ్చిమ గోదావరిలలో 25 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu