సర్పవరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్: ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

Published : Mar 11, 2021, 03:27 PM ISTUpdated : Mar 11, 2021, 04:11 PM IST
సర్పవరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్: ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

సారాంశం

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరం టైకీ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం నాడు బాయిలర్ పేలింది.ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  

తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరం టైకీ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం నాడు బాయిలర్ పేలింది.ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకొంది. బాయిలర్ పేలుడుకు గల కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.  సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

 

ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులను కోరారు.బాయిలర్ పేలుడుతో మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందకు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

ముందస్తు చర్యలు తీసుకోలేదు. కెమికల్ కులపుతున్న సమయంంలో ప్రమాదవశాత్తు బెయిలర్ పేలుడు చోటు చేసుకొంది.సంఘటన స్థలాన్ని  మంత్రి కన్నబాబు సందర్శించారు. కంపెనీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్