అనకాపల్లి జీఎఫ్ఎంఎస్ ఫార్మాలో రియాక్టర్ పేలుడు: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Published : Jan 31, 2023, 12:19 PM ISTUpdated : Jan 31, 2023, 12:26 PM IST
అనకాపల్లి జీఎఫ్ఎంఎస్  ఫార్మాలో  రియాక్టర్ పేలుడు: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

సారాంశం

అనకాపల్లి  జిల్లాలోని  అచ్యుతాపురం సెజ్ లో  గల ఫార్మా కంపెనీలో మంగళవారం నాడు రియాక్టర్ పేలింది.  ఈ పేలుడులో  ఒకరు మృతి చెందారు.  

అనకాపల్లి:  అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం   సెజ్ లో  గల జీఎఫ్ఎంఎస్ ఫార్మాలో మంగళవారంనాడు పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో  ఒకరు మృతి చెందారు. మ రో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.  భారీ శబ్దంతో రియాక్టర్ పేలిందని  స్థానికులు చెబుతున్నారు.  రియాక్టర్ పేలడంతో   ఈ కంపెనీలో  పనిచేస్తున్న కార్మికులు  భయంతో పరుగులు తీశారు.  

రియాక్టర్ పేలుడుతో  ఈ కంపెనీలో  మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నమాపక సిబ్బంది  ఫార్మా కంపెనీకి  చేరుకుని  మంటలను ఆర్పుతున్నారు.   రియాక్టర్ పేలుడుతో  అక్కడే  విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  రియాక్టర్ పేలుడుతో  చెలరేగిన మంటల కారణంగా  కార్మికులకు మంటలు అంటుకుని గాయపడినట్టుగా  సమాచారం.  ప్రమాదం జరిగిన స్థలంలో  ఒక కార్మికులు  మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో  ముగ్గురు కార్మికులను   ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో  ముగ్గురు కార్మికులు  చికిత్స పొందుతున్నారు.   రియాక్టర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడకండి | YS Jagan On AP Police | AP Localbody Elections 2026
మాది టైం వస్తది | YS Jagan Sensational Comments On Chandrababuy | AP Local Body Elections 2026