చంద్రబాబు కోసం చావడానికైనా రెడీ.. బుద్ధా వెంకన్న

Published : May 28, 2019, 12:54 PM IST
చంద్రబాబు కోసం చావడానికైనా రెడీ.. బుద్ధా వెంకన్న

సారాంశం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కర్ణుడు చావు చావడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు.


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కర్ణుడు చావు చావడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో బుద్ధా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తే సహించమని తేల్చిచెప్పారు. టీడీపీ అంటనే పోరాటమని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం కర్ణుడు చావు చస్తానని.. తాను చచ్చేంత వరకూ చంద్రబాబుతోనే ఉంటానని బుద్ధా తెలిపారు. పార్టీలు మారే వారికి ఈ ఎన్నికలే గుణపాఠం అని ఆయన చెప్పారు.

కాగా.. ఏపీ ఎన్నికల ముందు టీడీపీ 130 సీట్లతో అధికారంలోకి వస్తుందని తొడగొట్టి మరీ బుద్ధా చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురేయగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. ఫలితాల అనంతరం తొలిసారిగా బుద్ధా మీడియా ముందుకు వచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్