విప్లవాత్మక వ్యవసాయానికి తెరలేపిన మెకానిక్...!

By Ramya news teamFirst Published Feb 25, 2022, 1:35 PM IST
Highlights

తెలివిగా చేస్తే.. వ్యవసాయంతో లాభాల బాట పట్టొచ్చు.. భూమిలో బంగారం పండించవచ్చని చాలా మంది నిరూపించారు. అయితే.. వ్యవసాయం అంటే.. రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టాలను చలించిన ఓ వ్యక్తి.. రైతుల  కోసం కొన్ని యంత్రాలను ఆవిష్కరించాడు.

వ్యవసాయం అంటే.. ఈ రోజుల్లో  చాలా మంది నచ్చని పదం. ఒకప్పుడు మన తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ వ్యవసాయం చేసిన వారే. కానీ.. తర్వాతర్వాత వ్యవసాయం మీద అందరి ఇష్టం పోయింది. వ్యవసాయం అంటే దండగ అనే అభిప్రాయం చాలా మందిలో పడిపోయింది. అయితే... తెలివిగా చేస్తే.. వ్యవసాయంతో లాభాల బాట పట్టొచ్చు.. భూమిలో బంగారం పండించవచ్చని చాలా మంది నిరూపించారు. అయితే.. వ్యవసాయం అంటే.. రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టాలను చలించిన ఓ వ్యక్తి.. రైతుల  కోసం కొన్ని యంత్రాలను ఆవిష్కరించాడు.

రాజస్థాన్‌లోని ఒక వ్యక్తి తన అసాధారణ ఆవిష్కరణలతో రైతుల జీవితాలను సులభతరం చేస్తున్నాడు. 46 ఏళ్ల శర్వాన్ కుమార్ బజ్యా ఒక మోటార్ సైకిల్ మెకానిక్. ప్రతిరోజూ తమ గ్రామంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన శర్వాన్... ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడు. మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయాలని అనుకున్నాడు.  అతను మాన్యువల్ లేబర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి , వృధాను తగ్గించడానికి అనేక ఉపయోగకరమైన పరికరాలను అభివృద్ధి చేశాడు.

Latest Videos


రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన శర్వాన్ చేతితో, బ్యాటరీతో పనిచేసే సీడ్ డ్రిల్స్, బహుళ ప్రయోజన విత్తనాలు , జలమార్గాన్ని సృష్టించే యంత్రం, కలుపు తీసే యంత్రం, ఉల్లిపాయ హార్వెస్టర్ , సాల్ట్ టర్నర్‌తో సహా అనేక పరికరాలను నిర్మించారు. 

ఇప్పటి వరకు చాలా యంత్రాలను అతను తయారు చేశాడు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తాడు. కేవలం యంత్రాలు తయారు చేయడం మాత్రమే కాదు.. వాటిని ఆర్డర్స్ మీద అందరినీ సరఫరా కూడా చేస్తాడు.  అతనికి సౌదీ అరేబియా వంటి దేశాల నుండి కూడా ఆర్డర్‌లు వస్తున్నాయట. ఈ విషయంపట్ల అతను సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.

click me!