Mohammed Shami: షమీ ఎమోషనల్ పోస్టు..నెట్టింట్లో వైరల్..

By Rajesh KarampooriFirst Published Nov 23, 2023, 3:45 AM IST
Highlights

Mohammed Shami: భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రపంచకప్ తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడు.ఈ సందర్భంగా ఓ ఫోటోను షేర్ తన తల్లితో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏం పోస్ట్  ఎంటీ..?

Mohammed Shami: ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా ఆరోగ్యం క్షీణించింది. గ్రామంలోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సదుపాయాల కోసం నగరానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంది.

ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రపంచకప్ తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంలో తన తల్లితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 'నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను  ' అని ఎమోషనల్ కామెంట్ రాశారు. దీనితో పాటు హార్ట్ ఎమోజీని కూడా జోడించాడు.

చివరి రోజు విషమించిన ఆరోగ్యం 

మహ్మద్ షమీ సోదరి షబీనా ఖాతూన్ తన తల్లి అంజుమ్ అరా ఆరోగ్యంపై అప్‌డేట్ ఇస్తూ.. రెండు రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న తనకు ఇప్పుడు మెరుగ్గా ఉందని చెప్పారు. ప్రపంచకప్ ఫైనల్ రోజు ఉదయం నుంచి జ్వరం పెరిగింది. తీవ్రమైన నొప్పి రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మందులు తీసుకుని మధ్యాహ్నానికే ఇంటికి వచ్చింది. షమీ కుటుంబం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సహస్‌పూర్ గ్రామంలో నివాసిస్తుంది.

మహమ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి అత్యధికంగా 24 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే షమీకి తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాలేదు. ఇదిలావుండగా, అందరినీ అధిగమించి వికెట్ల రేసులో ముందున్నాడు. భారత గడ్డపై ఫాస్ట్ బౌలర్ చేసిన ఈ ప్రదర్శన అపురూపం. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా షమీ నిలిచాడు. ఫైనల్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చినా షమీ ఆటతీరును అందరూ మెచ్చుకున్నారు. గత ప్రపంచకప్‌లో అంటే 2019లో నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, 2015 ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.

You mean so much to me Mum. Hope you’re feeling better very soon. pic.twitter.com/zxa8Lp08aE

— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11)
click me!