ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌లో టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే.. గత 20 ఏండ్లుగా ఓ సెంటిమెంట్ రీపిట్ అవుతోంది. ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ రీపిట్ అవుతుందా? అనే టీమిండియా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటీ?. ఎందుకు టీమిండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారో మీరు కూడా ఓ లూక్కేయండి..
IND vs AUS ICC World Cup 2023:ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరువైంది. విశ్వవిజేత చరిత్రకెక్కడానికి ఇరుజట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. 20 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్స్ భారత్ , ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా నేడు జరిగే ఈ ప్రతీకార పోరును చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటీ హైవోల్టేజ్ పరిస్థితిలో టీమిండియా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. గత 20 ఏండ్లుగా ఓ సెంటిమెంట్ రీపిట్ అవుతోంది. ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ రీపిట్ అవుతుందా? అనే టీమిండియా ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటీ? టీమిండియా ఫ్యాన్స్ ఎందుకంత టెన్షన్ పడుతున్నారో మీరు కూడా ఓ లూక్కేయండి..
2023 వన్డే ప్రపంచకప్ లో ఎదురులేని జట్టుగా టీమిండియా జైత్రయాత్ర చేస్తూ.. ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఆసీస్ తో జరిగే టైటిల్ సమరానికి భారత్ సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే పోరు ముంగిట ఓ సెంటిమెంట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ సెంటిమెంట్ ను కెప్టెన్ల పెళ్లిళ్లతో ముడిపెట్టిన టీమిండియా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న కెప్టెన్‌లు మరుసటి ఏడాదే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుంటున్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న కెప్టెన్ ఈ ఏడాది ప్రపంచకప్ అందుకుంటాదని నమ్ముతున్నారు కొంత మంది విశ్వస్తున్నారు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 2002లో పెళ్లి చేసుకోగా.. మరుసటి జరిగిన 2003లో ప్రపంచకప్ ట్రోఫీ అందుకున్నాడు. అలాగే.. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2010లో వివాహం చేసుకోగా 2011లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ సెంటిమెంట్ ఆగకుండా అలాగే రీపిట్ అవుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 2018లో పెళ్లి చేసుకోగా.. 2019లో తన జట్టు ట్రోఫీని అందుకుంది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2022లో పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కప్ అందుకుంటుందనీ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీంతో టీమిండియా అభిమానుల్లో కాస్తా టెన్షన్ మొదలైంది. అయితే.. ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ చేసి రోహిత్ సేన విశ్వవిజేతగా నిలుస్తుందనీ, ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని భారత అభిమానులు భావిస్తున్నారు.