ICC World Cup 2023: 2023 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని, పశ్చిమ రైల్వే శుభవార్త చెప్పింది. ఇంతకీ రైల్వే చెప్పిన ఆ తీపికబురు ఏమిటంటే..?
ICC World Cup 2023: ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే హోరాహోరీ పోరును ప్రత్యేక్షంగా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. ఈ తరుణంలో విమాన టిక్కెట్ల ధరలు, హోటల్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమయంలో క్రికెట్ అభిమానుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ తన తరుపున ఓ గిఫ్ట్ ఇస్తోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ కోసం రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రైల్వే ముంబై సెంట్రల్-అహ్మదాబాద్, బాంద్రా టెర్మినస్-అహ్మదాబాద్ , ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)-అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ మధ్య
undefined
ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ స్పెషల్ (09035): ముంబై సెంట్రల్ నుండి 19 నవంబర్ 2023 ఆదివారం ఉదయం 05.15 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు ఉదయం 10.40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ స్పెషల్ (09036) : ఈ రైలు అహ్మదాబాద్ నుండి 20 నవంబర్ 2023 సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు ఉదయం 07.25 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు బోరివలి, సూరత్, వడోదర స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో AC చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-అహ్మదాబాద్ ప్రత్యేక రైలు( 01155) : ఈ రైలు నవంబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి బయలుదేరుతుంది. ఉదయం 09 గంటల వరకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అహ్మదాబాద్-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్పెషల్ (01156) : ఈ రైలు 20 నవంబర్ 2023 సోమవారం ఉదయం 5 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరుతుంది. రైలు మధ్యాహ్నం 02.30 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు చేరుకుంటుంది. ఈ రైలు దాదర్, థానే, వసాయ్ రోడ్, సూరత్ , వడోదర స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది.
ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ ప్రత్యేక రైలు (09049): ఈ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు 18 నవంబర్ 2023న ముంబై సెంట్రల్ నుండి రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది. రైలు మరుసటి రోజు ఉదయం 08.45 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ ప్రత్యేక రైలు ( 09050): ఈ ప్రత్యేక రైలు అహ్మదాబాద్ నుండి 20 నవంబర్ 2023 ఉదయం 06.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 02.10 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు బోరివలి, వాపి, సూరత్, భరూచ్ , వడోదర స్టేషన్లలో ఆగుతుంది.
బాంద్రా టెర్మినస్-అహ్మదాబాద్ మధ్య
బాంద్రా టెర్మినస్ - అహ్మదాబాద్ స్పెషల్ (09001): ఈ రైలు 18 నవంబర్ 2023 శనివారం రాత్రి 11:45 గంటలకు బాంద్రా టెర్మినస్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరుతుంది. అదే విధంగా, రైలు నెం. 09002 అహ్మదాబాద్ - బాంద్రా టెర్మినస్ స్పెషల్ 20 నవంబర్ 2023 సోమవారం ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 12.10 గంటలకు బాంద్రా టెర్మినస్ చేరుకుంటుంది. వడోదర జంక్షన్ లో ఆగుతుంది. ఈ రైలులో ఏసీ ఐ-టైర్, ఏసీ 2-టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్, జనరల్ కోచ్‌లు ఉంటాయి.
ముంబై సెంట్రల్-అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ (09049 ) : ఈ రైలు ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ స్పెషల్ 18 నవంబర్ 2023 శనివారం నాడు 11-55 గంటలకు ముంబై సెంట్రల్ నుండి బయలుదేరి తదుపరి 08.45 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా, రైలు నెం. 09050 అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ స్పెషల్ నవంబర్ 20, 2023 సోమవారం ఉదయం 06.20 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2-10 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు బోరివలి, వాపి, వల్సాద్ మీదుగా నడుస్తుంది. రెండు దిశలలో ఇది సూరత్, భరూచ్ మరియు వడోదర జంక్షన్ వద్ద ఆగుతుంది. ఈ రైలులో ఏసీ ఐ-టైర్, ఏసీ 2-టైర్, ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ జనరల్ కోచ్‌లు ఉంటాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (ముంబై)-అహ్మదాబాద్ వైపు
రైలు నెం. 01153 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) - అహ్మదాబాద్ స్పెషల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి శనివారం 18వ తేదీన బయలుదేరుతుంది. నవంబర్ 2023 ఉదయం 10-30 గంటలకు , మరుసటి రోజు ఉదయం 06.40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా, రైలు నెం. 01154 అహ్మదాబాద్ - ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (CSMT)స్పెషల్. 20 నవంబర్ 2023 సోమవారం నాడు 01.45 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి అదే రోజు 10.35 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు చేరుకుంటుంది. రైలు దాదర్ (సెంట్రల్), థానే, కమాన్ రోడ్, వసాయి రోడ్, సూరత్ మరియు వడోదర జంక్షన్‌లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలులో AC I-టైర్, AC 2-టైర్, AC 3-టైర్, రెండవ తరగతి జనరల్ కోచ్‌లు ఉంటాయి. బుకింగ్ కోసం.. అన్ని PRS కౌంటర్లలో, IRCTC వెబ్‌సైట్‌లో సంప్రదించండి. రైల్వే ప్రత్యేక ఛార్జీలతో ప్రత్యేక రైలుగా నడుస్తుంది.