దిశ నిందితుల ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. దిశపై అత్యాచారం, హత్య కావడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమనే విమర్శలు కూడ లేకపోలేదు.
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. దిశపై అత్యాచారం, హత్య కావడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమనే విమర్శలు కూడ లేకపోలేదు.
దిశ ఘటన విషయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన కామెంట్స్ కూడ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ అంశాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేశాయి.. అయితే దిశ ఎన్‌కౌంటర్‌తో కేసీఆర్ సర్కార్‌కు అనుకూలంగా మారింది.
also read:Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి
అయితే నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత యావత్తూ దేశం తెలంగాణ వైపు చూసింది. గతంలో చోటు చేసుకొన్న ఘటనలపై కూడ నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ నెలకొంది.
దిశ నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజకీయపార్టీల నేతలను కూడ బాధిత కుటుంబం పరామర్శించకుండా అడ్డుకొన్న కాలనీవాసులు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత అదే కాలనీవాసులు సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు.
Also read:సజ్జనార్: నాడు వరంగల్‌లో, నేడు షాద్‌నగర్‌లో నిందితుల ఎన్‌కౌంటర్
గత నెల 27వ తేదీన శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిశపై నలుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలలోపుగానే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ గ్యాంగ్‌రేప్, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని రాజకీయ నాయకులు పరామర్శించారు. అయితే కాలనీవాసులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. రాజకీయనేతలు, పోలీసులు , మీడియా ఎవరూ కూడ బాధిత కుటుంబాన్ని కలవకుండా ఈ నెల 1వ తేదీన గేటుకు తాళం వేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే కాలనీవాసులు అడ్డుకొన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అతి కష్టం మీద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
దిశ ఘటనపై ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో దిశ ఉదంతం కూడ చర్చకు వచ్చింది. ఈ ఘటనపై అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పోలీసులు వ్యవహరించిన తీరును నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు.
దిశ నిందితులను ఈ నెల 4వ తేదీన షాద్‌నగర్ కోర్టు 10 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అందించింది. ఈ నెల 6వ తేదీన ఉదయం చటాన్‌పల్లి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు.
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిశాయి. దిశ నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సమయంలో పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు.. నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకొన్న చాలా మంది పూల వర్షం కురిపించారు.
దిశ ఘటన విషయమై సీఎం కేసీఆర్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసిన దిశ కాలనీవాసులు కూడ ఈ ఎన్‌కౌంటర్ తర్వాత కేసీఆర్‌ను అభినిందించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
తెలంగాణ సీఎం మౌనం ఎంత తీవ్రంగా ఉంటుందో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత తెలిసి వచ్చిందని తెంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి.
ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు
ఈ నెల 1వ తేదీన రాష్ట్రంలోని 97 ఆర్టీసీ బస్ డిపోల నుండి ఐదుగురు ఎంపిక చేసిన కార్మికులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు.ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ చేశారు. ఆ తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడంపై కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. రాత్రి 8 గంటల వరకే మహిళా కండక్టర్లకు విధులు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు. టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసిన ప్రయాణీకులనే బాధ్యత చేసేలా నిర్ణయం తీసుకొంటామని సీఎం హామీ ఇచ్చారు.
సమ్మె చేసిన కాలానికి వేతనాన్ని ఇవ్వనుంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ జీతం వెంటనే చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. అన్నట్టుగానే వెంటనే సెప్టెంబర్ జీతాలను చెల్లించారు.
ఆర్టీసీని కాపాడేందుకు కార్మికులతో చర్చించారు. మరో నాలుగు మాసాల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.