క్రైమ్ రౌండప్: ఐసిసి అధినేత బాగ్ధాదీ హతం.. ప్రసాదంలో విషం పెట్టి 8 మంది హతం.. మరిన్ని

By sivanagaprasad Kodati  |  First Published Oct 27, 2019, 12:28 PM IST

అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం
 


అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం.

లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం

Latest Videos

ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బాగ్ధాదీని మట్టుబెట్టేందుకే అమెరికా సైన్యం ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించాయని తెలుస్తోంది. అనుకున్న లక్ష్యం నేరవేరినట్లుగా సైనిక ఉన్నతాధికారులు వైట్ హౌస్‌కు సమాచారం అందించారని ‘‘ న్యూస్ వీక్’’ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

అబు బకర్‌ను అంతం చేసేందుకు అత్యున్నత స్థాయిలో పథకరచన చేశారని.. ఈ ఆపరేషన్‌కు ట్రంప్ సైతం ఆమోదముద్ర వేసినట్లుగా కథనంలో పేర్కొంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ‘‘ ఇప్పుడే ఒక పెద్ద సంఘటన’’ జరిగిందంటూ ట్రంప్ ట్వీట్ చేయడం పలు అనుమానాలను కలిగిస్తోంది.

వాయువ్య సిరియాలో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. అక్కడ పదుల సంఖ్యలో ఉగ్రవాదుల మృతదేహాలు పడివుండటం.. గుర్తు పెట్టేందుకు వీలు లేకపోవడంతో బాగ్ధాదీ మృతదేహాన్ని గుర్తించాలంటే డీఎన్ఏ, బయోమెట్రిక్ పరీక్షలు నిర్వహించాల్సి వుంది. దాడులు జరుగుతున్న సమయంలో అబు బకర్ ఆత్మాహుతి దాడికి యత్నించాడని సైన్యం తెలిపింది. 

డబ్బున్న వారే టార్గెట్: ప్రసాదంలో విషం 8 మంది హతం

కేరళలోని కోజికోడ్‌లో ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులనే ఆ ఇంటి కోడలు హతమార్చిన సంఘటన మరచిపోకముందే అచ్చం అదే తరహా ఘటన ఏపీలో జరిగింది. కాకపోతే ఇక్కడ కుటుంబసభ్యులకు బదులు బయటివారిని డబ్బు కోసం హతమార్చాడో కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారిని ఎంచుకున్నాడు. తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని ఎంచుకుని పూజల పేరిట మాయ చేశాడు.

పూజ చేయించి నాణేం ఒకటి దగ్గర ఉంచుకుంటే అపర కుబేరులు అవుతారని చెప్పేవాడు. తీరా పూజలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాని వ్యక్తులు నిలదీస్తే పెద్ద పూజ చేయించానని చెప్పి విషం కలిపిన ప్రసాదం ఇచ్చి హతమార్చేవాడు. ఇతని నిజస్వరూపం ఈ నెల 16న ఓ పీఈటీ హత్యతో వెలుగులోకి వచ్చింది. ఏలూరుకే చెందిన పీఈటీ నాగరాజు ఈ నెల 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటికే అతను మరణించాడు. గుండెపోటుతోనే నాగరాజు మరణించాడని కుటుంబసభ్యులు తొలుత భావించారు. ఐతే ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తీసుకెళ్లిన రూ.2 లక్షల నగదు, ఒంటిపై గల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నాగరాజుతో చివరిగా ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది.

ముందు నాగరాజు మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యక్తి చెప్పినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు. అతనికి ప్రసాదంలో విషం కలిపి ఇచ్చి అనంతరం ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు, డబ్బును తాను తీసుకున్నట్లు అంగీకరించాడు. పోలీసులు మరింత లోతుగా విచారించగా ఆ వ్యక్తి గతంలో ఇదే తరహాలో ప్రసాదంలో విషం కలిపిచ్చి 8 మందిని చంపినట్లుగా తేలింది.

ఏలూరులో ముగ్గురు , కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురిని ఇలాగే హతమార్చినట్లు నిందితుడు చెప్పాడు. తానిచ్చిన ప్రసాదాన్ని తిన్న వెంటనే వారు మరణించేవారని.. అయితే మృతుల కుటుంబసభ్యులు మాత్రం హార్ట్ అటాక్‌తో చనిపోయినట్లు భావంచేవారని ఆ వ్యక్తి వెల్లడించాడు. 

భర్తతో గొడవ కొడుకుకి యాసిడ్ తాగించి చంపిన కన్నతల్లి

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను ఓ కన్నతల్లే మాతృత్వాన్ని మరిచి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలకు చెందిన శివరాణిని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కరకు చెందిన పోతుల శివరెడ్డికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఐదేళ్ల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఉన్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రతిరోజూ గొడవలు జరుగుతుండటంతో ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.

పని నిమిత్తం తల్లీదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లడంతో శివరాణి గత ఎనిమిది నెలలుగా వర్కాలలోనే ఉంటుంది. ఈ క్రమంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని శివరాణి పేరిట రాయించారు తల్లీదండ్రులు. అయితే ఆ భూమిని విక్రయించి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా శివరెడ్డి.. భార్యను తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు రావాల్సిందిగా శివరాణికి భర్త ఫోన్ చేసి పిలవగా.. తాను రానని తేల్చి చెప్పింది.

దీంతో అతను తన బిడ్డను తనకు అప్పగించాల్సిందిగా గొడవకు దిగాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివరాణి.. అవసరమైతే కొడుకునైనా చంపుకుంటా గానీ నీకు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కుమారుడు యశ్వంత్‌కి మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్ తాగించి నిద్రపుచ్చింది. శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి కుమారుడు మరణించడాన్ని చూసి తట్టుకోలేక భయంతో ఆమె సైతం యాసిడ్ తాగి 100కు సమాచారం ఇచ్చింది.

వెంటనే వర్కాలలోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు శివరాణిని ఆసుపత్రికి తరలించి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలకు అన్యాయంగా అభం శుభం తెలియని చిన్నారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

పండగపూట హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం.. హయత్‌నగర్‌లో చోరీలు


దీపావళీ పండుగపూట హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతోంది. హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు ప్రాంతంలో చెడ్డీగ్యాంగ్ సంచారం అలజడి రేపుతోంది. మూడు రోజుల సమయంలో రెండు దొంగతనాలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. కుంట్లూరులోని ఓ వీధిలో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ దృశ్యాల సాయంతో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వీరి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమీషనరేట్ వీలైనంత త్వరగా చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలిస్తోంది. 

యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్‌ సైనేడ్‌ మోహన్‌ కుమార్‌ (56)కు మరణ శిక్ష ఖరారయింది.  మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం కేసులో అతనిపై నేరారోపణలు రుజువయ్యాయి. 

మహిళలే టార్గెట్...గర్భనిరోదక మాత్ర పేరిట సైనెడ్ ఇచ్చి.... నాలుగోసారి మరణ శిక్ష

విచారణ పూర్తి కావడంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ సయిదున్నిసా గురువారం శిక్ష ఖరారు చేస్తానని తెలిపారు. గురువారం తీర్పు వెలువరిస్తూ మోహన్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తరువాత మరణ శిక్ష అమలు చేయాలని తెలిపారు. హైకోర్టు మరణ శిక్షను ధృవీకరిస్తే ఇతర నేరాల్లో కోర్టులు అతనికి విధించిన శిక్షలను కూడా ఇందులోనే కలిపేయాలని ఆదేశించారు. మొత్తం 17 కేసులకు గాను నాలుగింటిలో అతనికి మరణ శిక్ష ఖరారు అయింది. 

సుమారు పదేళ్ల కిందట... దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాళెపుణి అంగనవాడిలో సహయకురాలిగా పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకుని, ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి మెజెస్టిక్‌ వద్ద లాడ్జిలో దిగారు. మరుసటి రోజుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలంటూ సైనేడ్‌ఇచ్చాడు. ఆమె నగలు, డబ్బుతో పరారయ్యా డు. సైనైడ్‌ మింగిన యువతి కొంతసేపటికే మరణించింది. మరో కేసులో అతన్ని పట్టుకుని విచారిస్తుండగా నేరం బయటపడింది. 

అతనికి మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం, డబ్బుదస్కంతో ఉడాయించడం నైజం. వెళ్తూ వెళ్తూ సైనైడ్‌తో మట్టుబెట్టడంలో ఆరితేరాడు. సుమారు 20 మంది అమాయ మహిళలను ఇలా హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. 1980 నుంచి 2003 వరకు మంగళూరు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయ మహిళలను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు.  

కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో సైనైడ్‌ను ఉపయోగించి తన హత్యా పరంపరపను కొనసాగించాడు. పలువురు మహిళల హత్య కేసుల్లో ఇతనికి 2013లో కూడా మంగళూరు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, బెదిరించడం వంటి కేసుల్లోనూ మోహన్‌ నిందితుడు. 2007లో బెంగళూరులో ఒక సంగీత ఉపాధ్యాయన్ని నమ్మించి ఇలాగే హత్య చేశాడు. 
 

click me!