వల్లభనేని వంశీ వ్యూహం ఇదే: అదే జరిగితే చంద్రబాబుకు పెద్ద దెబ్బ

By telugu teamFirst Published Nov 17, 2019, 4:13 PM IST
Highlights

గీత దాటినా వేటు పడకుండా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జాగ్రత్తపడినట్లు కనిపిస్తోంది. టీడీపీ నుంచి సస్పెండ్ కావడం ద్వారా ఆయన శాసనసభలో ప్రత్యేకంగా కొనసాగే అవకాశం సస్పెన్షన్ వల్ల దక్కించుకున్నట్లు భావిస్తున్నారు..

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడిపై, టీడీపీ నేతలపై విరుచుకుపడడంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా వ్యవహిస్తున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ ఆయన టీడీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. తాను కోరుకుందీ అదే, చంద్రబాబు ఇచ్చిందీ అదే అన్నట్లు పరిస్థితి మారింది. 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇది ఒక రకంగా ఫిరాయింపులను నిరోధిస్తుందని నమ్ముతున్నారు. అయితే, ఆయనే మరో మాట కూడా అన్నారు. వంశీ సస్పెండ్ అయిన ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకు ప్రత్యేక సీటు కేటాయిస్తామని సీతారాం అన్నారు. 

Also Read: వల్లభనేని వంశీపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర కామెంట్స్

తమ్మినేని సీతారాం మాటలను బట్టి వంశీ శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తనకు ప్రత్యేక సీటు కేటాయించే విధంగా సస్పెన్షన్ కు గురై వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడదలుచుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అందుకే తాను వైసీపీలో చేరబోనని, వైఎస్ జగన్ తో కలిసి నడుస్తానని వంశీ చెప్పారు. తాను వైసీపీలో చేరుతున్నట్లు ఓ సందర్భంలో మాట జారిన వంశీ తాను వైసీపీలో చేరబోవడం లేదని చెప్పి తర్వాత సర్దుబాటు చేసుకున్నారు 

వంశీ వ్యూహం గనుక ఫలిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు ఆయన భాటలో నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇసుక కొరతపై చంద్రబాబు చేసిన దీక్షకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారు ఎందుకు దీక్షకు రాలేదనేది తెలియదు. కానీ వారంతా వంశీ బాటలో నడిచే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. 

డిసెంబర్ 2వ తేదీ నుంచి శాసనసభ శీతాకాలం సమావేశాలు జరగనున్నాయి. వంశీని టీడీపీ సస్పెండ్ చేసినట్లుగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ఆసరా చేసుకుని వంశీకి స్పీకర్ ప్రత్యేకమైన సీటును కేటాయిస్తారు. అలా కేటాయించిన తర్వాత టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన బాటలో నడవవచ్చునని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చు. 

Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఎంత మంది ఎమ్మెల్యేలు వంశీ బాటలో నడుస్తారనేది శీతాకాలం సమావేశాల్లో తేలిపోతుందని అంటున్నారు. అనర్హత వేటు పడకుండా, వైసిపీ వైపు రావడానికి ఇది సరైన మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ కూడా దీన్ని ఆమోదించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

ఇసుక కొరతపై, పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై వంశీ జగన్ ప్రభుత్వాన్ని శాసనసభలో సమర్థించే అవకాశాలున్నాయి. సస్పెన్షన్ కు గురి కావడానికే వంశీ తీవ్ర పదజాలం వాడారని, దానికితోడు చంద్రబాబును, లోకేష్ ను లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గీత దాటుతూనే వేటు పడకుండా చూసుకుంటే చంద్రబాబుకు పెద్ద దెబ్బ అవుతుందని అంటున్నారు.

టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

click me!