విశాఖలో పరిపాలనా రాజధాని... ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీ

By Arun Kumar P  |  First Published Jan 11, 2020, 4:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. 


విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మంచి మద్దతు లభిస్తోంది. ఆ ప్రాంతాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య  ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.  

అంతేకాకుండా విశాఖపట్నం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీమిలి నియోజకవర్గ పరిధిలో రాష్ర్ట మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గ నేతలు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Videos

undefined

గాజువాక నియోజకవర్గ పరిధిలో వైసీపీ శ్రేణులు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకు భారీ ర్యాలీ నిర్వవహించారు. అలాగే విశాఖ నార్త్ నియోజకవర్గ ఇంచార్జి కేకే రాజు ఆద్వర్యంలో బిర్లా జంక్షన్ నుంచి గురుద్వార్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

read more  మూడు రాజధానుల ప్రకటన వెనకున్న రహస్యమిదే: నాదెండ్ల

.విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఇంచార్జి అక్కరమాని విజయనిర్మల  ఆధ్వర్యంలో ఇసుకతోట నుంచి ఎంవీపి వరకు ర్యాలీ నిర్వహించారు. 

బీమిలి నియోజకవర్గ పరిధిలోని మంత్రి అవంతి  ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేపట్టి సమావేశం నిర్వహించారు.  ఈ  సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరు స్వాగతిస్తున్నారని అన్నారు.వెనుకబడిన తమ ప్రాంత అభివృద్ది  కోసం సీఎం ప్రత్యేక  శ్రద్ద చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారని...ఇందుకుగాను  ఆయనకు  కృతజ్ఞతలు  తెలుపుతున్నానని అవంతి అన్నారు.  
 

click me!