చట్టసభల్లో నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు...: వెంకయ్య నాయుడు

By Arun Kumar P  |  First Published Feb 8, 2020, 7:34 PM IST

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ''ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయో గ్రఫీ'' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 


విశాఖపట్నం: ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన బుక్ ని ఆవిష్కరించడం చాలా అనందంగా ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో ''ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయో గ్రఫీ'' బుక్ ని ఉపరాష్ట్రపతి రీలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీ భరత్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశాఖ నుండే ఒకటిన్నర ఏడాది పాటు కారాగారం ఉంటూ జీవితంలో ఏ విధంగా అడుగులు వేయాలో నేర్చుకున్నానని అన్నారు. 

Latest Videos

undefined

ప్రస్తుతం రాజకీయాలు మరీ అద్వానంగా తయారయ్యాయని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో పార్టీలు, నాయకులు చాలా దిగజాని మాట్లాడుతున్నారని వెంకయ్య నాయుడు ఆరోపించారు. 

గాంధీ సిద్దాంతాలు, ఆశయాలు నేటి తరానికి అందిస్తున్న వ్యక్తి గా రామకృష్ణ నిలిచారని ప్రశంసించారు. అందుకే ఆయన అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అలాంటి వ్యక్తి  జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందాన్నిస్తోందన్నారు. 

సమాజంలో రోజురోజుకి మానవ  ప్రమాణాలు తగిపోతున్నాయని  ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇన్ని వనరులు ఉన్నా ఇంకా ముందుకు వెళ్ళలేకపోవడం బాధాకరమన్నారు.  ప్రపంచంలో జిడిపి లో మనం 5 వ  స్థానంలో ఉన్నామన్నారు. 

మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ పౌరులకు ఎవరిపై వివక్షత లేదు..భారత దేశం ఎవరిపై దండ యాత్ర చేయలేదన్నారు.సిఏఏపై ప్రజలు అధ్యాయనం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 


 

click me!