హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం: 11 చేరిన మృతుల సంఖ్య (చూడండి)

By telugu team  |  First Published Aug 1, 2020, 1:20 PM IST

విశాఖపట్నంలో మరో ప్రమాదం జరిగింది. హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ విరిగిపడి పది మంది మరణించారు. మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. క్రేన్ కింద పలువురు చిక్కుకున్నారని సమాచారం.


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ షిప్ యార్డులో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. హిందూస్థాన్ షిప్ యార్డులో లోడింగ్ విషయమై క్రేన్ ఆపరేషన్ చేస్తుండా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగింది.

క్రేన్ విరిగిపడి ముగ్గురు మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే మరణాల సంఖ్య 11కు చేరుకుంది. పలువురు కార్మికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం సమయంలో అక్కడ 20 మంది ఉన్నట్లు సమాచారం.గాయపడినవారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. క్రేన్ కింద మరో 8 మంది ఉన్నట్లు సమాచారం. 

Latest Videos

undefined

ఈ క్రేన్ ను దశాబ్దం క్రితం హిందూస్తాన్ షిప్ యార్డు కొనుగోలు చేసింది. దీని నిర్వహణను ఇటీవల ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. షిప్ యార్డు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆనయ ఆర్టీవోకు ఫోన్ చేసి చెప్పారు. షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

 

విశాఖలో మరో ప్రమాదం: షిప్ యార్డులో క్రేన్ విరిగిపడి ఇద్దరు మృతి . pic.twitter.com/fJDFZbUmkb

— Asianetnews Telugu (@asianet_telugu)

ఎల్డీ పాలీమర్స్ లో పేలుడు సంఘటన తర్వాత విశాఖపట్నంలో ఇతర ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 

click me!