పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, అద్భుతమైన వినియోగదారుల సేవలు, ఆసక్తికరమైన ఆఫర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రారంభం నేపథ్యంలో అందుబాటులో ఉన్నాయి
విశాఖపట్నం: భారతదేశంలోని నంబర్ వన్ ఎలక్ట్రానిక్స్ గొలుసుకట్టు దుకాణాల సంస్థ రిలయన్స్ డిజిటల్ తన రెండో స్టోర్‌ను విశాఖపట్టణంలోని ద్వారకానగర్‌లో శనివారం ప్రారంభించింది. 13,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల స్టోర్ 4 అంతస్తుల్లో కొలువుదీరి విశాఖపట్టణంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ స్టోర్‌గా నిలుస్తోంది. ఈ స్టోర్‌ను రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియన్ బేడ్, ఎల్‌జీ ఇండియా సీఈఓ, ఎండీ కి వాన్ కిమ్, ప్రముఖ సినీనటి రష్మికా మందన్నతో కలిసి ప్రారంభించారు.
రిలయన్స్ డిజిటల్ ద్వారకానగర్ స్టోర్ ఒక్కటే, విశాఖపట్టణంలో ప్రత్యేకంగా ఒక్కో కేటగిరీల వారిగా ఉత్పత్తుల కోసం ఒక్కో అంతస్తును కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ స్టోర్! టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు ఇలా ఒక్కో కేటగిరీకి ఒక్కో ఫ్లోర్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో వినియోగదారులు పెద్ద ఎత్తున ఉత్పత్తులను పొందవచ్చు. నైపుణ్యవంతులైన కస్టమర్ అసోసియేట్లు మరియు ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను కలిగి ఉండి వినియోగదారులకు అత్యంత ఇష్టమైన షాపింగ్ కేంద్రంగా స్టోర్ నిలుస్తోంది. దీంతోపాటుగా, వినియోగదారులకు రిలయన్స్ డిజిటల్ మద్దతు కలిగిన రెస్క్యూ సేవలు (ResQ services) సైతం లభ్యం కానున్నాయి. అన్ని రోజులు,ఎలాంటి ఒత్తిడి లేకుండా సమగ్రమైన సేవలు ఈ వేదికగా వినియోగదారులు పొందవచ్చు.
undefined
ఎల్‌జీ ఇండియా సీఈవో, ఎండీ కి వాన్ కిమ్ రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ - "రిలయన్స్ డిజిటల్ ఆవిర్భావం నాటి నుంచి ప్రముఖ బ్రాండ్ అయిన మేం వారితో అనుసంధానం అయి ఉన్నాం. పెద్ద ఎత్తున వృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాం. వినియోగదారుల ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ డిజిటల్ సేవలు అందిస్తోంది. పెద్ద ఎత్తున విస్తరించిన సేవలు, విశాఖపట్టణంలో భారీ స్టోర్ అందుబాటులోకి రావడం వంటివి వినియోగదారుల పట్ల రిలయన్స్ డిజిటల్ యొక్క చిత్తశుద్ధిని చాటిచెప్తోంది. ఎల్‌జీ సంస్థ తరఫున రిలయన్స్ డిజిటల్‌తో భాగస్వామ్యం అవడం పట్ల గర్విస్తున్నాం , సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం`` అని పేర్కొన్నారు.
ద్వారకానగర్ స్టోర్ గురించి రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియన్ బేడ్ వివరిస్తూ, ``విశాఖపట్టణంలో మా రెండో స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత చేరువ అవడంతో పాటుగా వినియోగదారులకు మా సేవలను ఇంకా మెరుగైనా రీతిలో అందించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాం. షాపింగ్ చేస్తున్న సమయంలో మరియు ఉత్పాదనలు కొనుగోలు చేసిన తర్వాత అత్యుత్తమ సేవలు అందించే సంస్థగా నిలవడం లక్ష్యంగా మేం కృషిచేస్తున్నాం. విశాఖపట్టణంలోని వినియోగదారులు మా స్టోర్‌లో షాపింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను`` అని ధీమా వ్యక్తం చేశారు.
సినీ నటి రష్మిక మందన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రారంభం సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకుంటూ, ``రిలయన్స్ డిజిటల్ ఎల్లప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన ఎలక్ట్రానిక్ షాపింగ్ కేంద్రంగా నిలుస్తోంది. ఈ గొప్ప ప్రారంభంలో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఆధునిక ఉత్పత్తుల కేంద్రంగా రిలయన్స్ డిజిటల్ స్టోర్ నిలుస్తోంది`` అని వెల్లడించారు.
రిలయన్స్ డిజిటల్ ద్వారకానగర్ స్టోర్ ప్రారంభ ఆఫర్‌గా ఆకర్షణీయమైన ప్రయోజనాలను వినియోగదారులకు అందజేస్తోంది. అన్ని రకాలైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 15% క్యాష్ బ్యాక్, యాక్సెసరీలపై 10% అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటుగా కొందరు అదృష్టవంతులైన వినియోగదారులు 1 కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్ సైకిల్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు లేదా ఐఫోన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంతేకాకుండా, ఖచ్చితమైన ప్రయోజనాలు కలిగించే అజియో ఓచర్ మరియు ఆరునెలల పాటు ఉచితంగా జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ వంటివి ఈ స్టోర్‌కు విచ్చేసే వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.
రిలయన్స్ డిజిటల్ గురించి....
భారతదేశంలోని 6700కు పైగా నగరాలు మరియు పట్టణాల్లో 370కి పైగా భారీ రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, 2000కు పైగా మై జియోస్టోర్లతో కలుపుకొని 7700కు పైగా జియో స్టోర్లతో రిలయన్స్ డిజిటల్ అతిపెద్ద ఎలక్ట్రానిక్ రీటైల్ స్టోర్లలో ఒకటిగా ప్రస్తుతం గుర్తింపు పొందింది. అదే సమయంలో దేశంలోని ప్రతి ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు అధునాతన టెక్నాలజీని చేరువ చేసింది.
రిలయన్స్ డిజిటల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఎక్స్పీరియన్స్ జోన్లు( హైఎండ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌లు అయిన హోం థియేటర్లు మరియు టెలివిజన్ల కోసం) వినియోగదారులకు ఆయా ఉత్పత్తులను తాకి చూసి అనుభూతి చెందే వెసులుబాటును కల్పించాయి. వాటి సేవలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
ఈ ఎక్స్పీరియన్స్ జోన్ల వల్ల ఆయా ఉత్పత్తుల ఖచ్చితమైన పనితీరును వినియోగదారులు అప్పటికప్పుడే ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. సుశిక్షితులు, నిపుణులు అయిన సిబ్బంది అన్ని స్టోర్లలో అందుబాటులో ఉండి విచ్చేసిన వినియోగదారులకు ఆ స్టోర్‌లోని ఉత్పత్తి యొక్క ప్రతి అంశాన్ని ఆత్మీయంగా వివరిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా, రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా విక్రయించిన ప్రతి ఉత్పత్తికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందించడుతుంది. రిలయన్స్ యొక్క సేవల విభాగం అయిన రిలయన్స్ రెస్క్య్యూ వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉండి సమగ్రమైన సంపూర్ణ సేవలు అందిస్తుంది.