ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ మంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
విశాఖ: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన తీరు సరికాదని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆరోపించారు. మండలి రద్దుకు సహేతుక కారణాలు లేవని... రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించారన్న ఒక్క కారణంతో మండలిని రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు. మండలి రద్దు ఆలోచన ముందునుంచి వుంటే ఎన్నికలకు ముందు ప్రకటన చేసివుంటే అర్ధం వుండేదని... కానీ ప్రజాభిప్రాయం లేకుండా మండలిని రద్దు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
మండలి కావాలా...? వద్దా..? అనే విషయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు రకాల వాదనలు వున్నాయని అన్నారు. అయితే ఇందుకోసం ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ వుండాలన్నారు. మండలి రద్దుపై ఏపి శాసనసభ ఆమోదించిన తీర్మానం అమలు కావడానికి చాలా సమయం పడుతుందని... పూర్తిస్థాయిలో రద్దు కావడానికి ఏడాది కాలం పట్టవచ్చని అన్నారు.
undefined
read more చైనా నుండి భారత్ కు కరోనా వైరస్... ఏపిలో హై అలర్డ్...: మంత్రి ఆళ్ల నాని
ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం సభలో ఇప్పుడేమీ కొత్తకాదని అన్నారు.ప్రస్తుతం మండలిలో టిడిపికి మెజార్టీ వుంది కాబట్టి తమ పప్పులు ఉండకకపోవడంతో ఏకంగా దాన్ని రద్దుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
శాసనమండలి రద్దుపై సీఎం జగన్ తొందరపడ్డారని గంటా అన్నారు. కేవలం మరో ఏడాది ఓపికపట్టివుంటే వైసిపికి మండలిలో బలం పెరిగే అవకాశం పుష్కలంగా వుండేదన్నారు. ముందుచూపు లేక వైసిపి తప్పటడుగు వేసిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ డీలిమిటేషన్ లో లోటు పాట్లు గుర్తించినట్లు గంటా పేర్కొన్నారు. హేతుబద్దత లేకుండా అధికారపార్టీకి అనుకూలంగా మార్చుకున్నారని.... ఉత్తర నియోజకవర్గంలో 17 పూర్తి స్ధాయి వార్డులు వున్నాయన్నారు. రిజర్వేషన్లు ఫైనలైజ్ అయ్యాక తదుపరి సమావేశం నిర్వహిస్తామని అన్నారు.
read more తన కోసం తమ్ముడు... కొడుకు కోసం నందమూరి కుటుంబం...: చంద్రబాబుపై అంబటి ఫైర్
తమ నాయకుల బలాబలాల ప్రకారం టికెట్ల పంపిణీ వుంటుందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఏ పార్టీకయినా చాలా కీలకమన్నారు. వీటిపై తాము ప్రత్యేక దృష్టి పెడుతున్నామని... కార్పొరేషన్ ఎన్నికలకు మంచి ఊపు వుందన్నారు. విశాఖలో తెలుగుదేశం పార్టీ తప్పక పట్టు నిలుపుకుంటుందని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.