కచోరీ కోసం ఏకంగా రైలు ఆపేసిన డ్రైవర్... ప్రతిరోజూ ఇదే తంతు..!

By Ramya news team  |  First Published Feb 24, 2022, 10:50 AM IST

 ఇలా ఒక్క రోజు కాదు.. ప్రతిరోజూ అంతే.. సరిగ్గా రైలు...  క్రాసింగ్ లైన్ దగ్గరకు రాగానే రైలు ఆపేస్తాడు. ఏమైందా..? ఇక్కడ రైలు ఎందుకు ఆగిందా అని ప్రయాణికులంతా చూస్తుండగా..  ఓ వ్యక్తి వచ్చి.. సదరు రైలు డ్రైవర్ కచోరీ ప్యాకెట్ ఇచ్చి వెళతాడు. 


మన దగ్గర పెద్దగా దీనిని తినడానికి ఇష్టపడరు కానీ.. ఉత్తర భారత దేశంలో.. కచోరీలను బాగా ఇష్టపడతారు. చాలా మంది ఈ కచోరీలను ప్రతిరోజూ తింటూ ఉంటారు. స్నాక్స్ లాగా తినే ఈ కచోరీ కోసం ఓ లోకో ట్రైన్ డ్రైవర్ ఏకంగా రైలు ఆపేశాడు. ఇలా ఒక్క రోజు కాదు.. ప్రతిరోజూ అంతే.. సరిగ్గా రైలు...  క్రాసింగ్ లైన్ దగ్గరకు రాగానే రైలు ఆపేస్తాడు. ఏమైందా..? ఇక్కడ రైలు ఎందుకు ఆగిందా అని ప్రయాణికులంతా చూస్తుండగా..  ఓ వ్యక్తి వచ్చి.. సదరు రైలు డ్రైవర్ కచోరీ ప్యాకెట్ ఇచ్చి వెళతాడు. గత కొంతకాలంగా ఇదే జరుగుతుండగా... తాజాగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ సంఘటన  రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 


यह वीडियो एकwhatsappग्रुप के माध्यम से आज ओर अभी देखने को मिला है

क्या यह रेलवे नियमानुसार सही है अगर गलत है तो एक्शन लीजिए और सम्बंधित सभी व्यक्तियों पर कार्यवाही करें pic.twitter.com/Tw5dtkozzn

— NARENDRA KUMAR JAIN (@NarendraJainPcw)

Latest Videos

undefined

 రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో  ఓ లోకోపైలట్ తనకిష్టమన కచోరీలు(Snacks) కోసం రైలును పట్టాలపై ఆపేశాడు. వాటిని తీసుకొని తిరిగి ట్రైన్ స్టార్ట్ చేశాడు. 
ఈ వీడియోను గమనిస్తే.. ఓ వ్యక్తి రైలు గేట్ సిగ్నల్స్ వద్ద పట్టాలపై నడుచుకుంటూ వస్తాడు. ఇంతలో ఓ ట్రైన్ నెమ్మదిగా ఆగుతూ.. అక్కడకు వస్తుంది. రైలు ఇంజిన్ రూం వద్దకు వెళ్లిన అతడు లోపల ఉన్న లోకోపైలట్‌కు తన చేతిలో ఉన్న ప్యాకెట్‌ను ఇస్తాడు. అనంతరం అతడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కొన్ని క్షణాలు పట్టాలపైనే ఉన్న రైలు నెమ్మదిగా అక్కడ నుంచి బయల్దేరుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఎవరికైనా.. డ్రైవర్ తన భోజనాన్ని తీసుకోవడానికి బస్సు ఆపినట్లు ఈ లోకోపైలట్ ట్రైన్ ఆపాడని అర్థమవుతుంది.  లోకోపైలట్ ఇంతకు సదరు వ్యక్తి నుంచి కచోరీలు తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

వీడియోను చూసిన నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. కొంతమంది లోకోపైలట్‌కు మద్దతుగా మాట్లాడుతుంటే.. ఎక్కువ మంది మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కచోరీల కోసం రైలు ఆపడమేంటని కామెంట్లు పెడుతున్నారు.

click me!