ఆర్డర్ చేసిన ఫుడ్ ని డెలివరీ బాయ్ కి ఇచ్చేశాడు.. అతని రియాక్షన్ చూశారా..!

By Ramya news team  |  First Published Mar 2, 2022, 2:49 PM IST

వాషింగ్టన్‌కు చెందిన షా డేవిస్ అనే వ్యక్తి ఆన్‌లైన్ డెలివరీ అప్లికేషన్ ద్వారా ఆహారం కోసం ఆర్డర్ చేశాడు. అయితే, అతను  ఆర్డర్ పెట్టిన అడ్రస్ పాతది కావడం గమనార్హం. గతంలో తాను ఉన్న ఏరియా అడ్రస్ చూసుకోకుండా పెట్టేశాడు. 


ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటోంది. ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా.. వెంటనే మనకు తెలిసిపోతోంది. ఈ క్రమంలో మనం ప్రతిరోజూ.. మన హృదయాలను తాకే వీడియోలు చూడగలుగుతున్నాం. అలాంటిదే.. ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ని.. ఓ వ్యక్తి డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తికే ఇచ్చేశాడు. ఆ ఫుడ్ అందుకున్న డెలివరీ బాయ్ రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Latest Videos

undefined

పూర్తి వివరాల్లోకి వెళితే..  వాషింగ్టన్‌కు చెందిన షా డేవిస్ అనే వ్యక్తి ఆన్‌లైన్ డెలివరీ అప్లికేషన్ ద్వారా ఆహారం కోసం ఆర్డర్ చేశాడు. అయితే, అతను  ఆర్డర్ పెట్టిన అడ్రస్ పాతది కావడం గమనార్హం. గతంలో తాను ఉన్న ఏరియా అడ్రస్ చూసుకోకుండా పెట్టేశాడు. 

ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు.  తాను రాంగ్ అడ్రస్  ఇచ్చాడని అర్థం చేసుకున్నాడు. ఆ కాసేపటికి డెలివరీ బాయ్.. మీరున్న అడ్రస్ వచ్చాను అంటూ మెసేజ్  చేశాడు. తాను అక్కడ లేకపోవడంతో.. ఆ ఫుడ్ ని డెలివరీ బాయ్ ని తినమని చెప్పేశాడు.  ఆ డెలివరీ బాయ్ ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని సదరు వ్యక్తి ఫేస్ బుక్ లో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.

ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో షా డేవిస్ షేర్ చేశారు, ఈ పోస్టుకి  110k రియాక్షన్‌లు, 2.2k కామెంట్స్,  82k షేర్స్ రావడం గమనార్హం.

 

. "నేను నా చిపోటిల్ యాప్‌లో నా చిరునామాను మార్చడం మర్చిపోయాను, కాబట్టి పాత చిరునామా అయోవాలో ఉన్నందున దానిని అతనినే తినమని డెలివరీ బాయ్ కి చెప్పాను. ముందు చూసుకోకుండా ఫుడ్ ఆర్డర్ చేసినందుకు కోపం వచ్చింది.  కానీ అతని రిప్లై చూసిన తర్వాత  చాలా సంతోషంగా అనిపించింది" అని అతను వ్రాసాడు. పోస్ట్. అతను పంచుకున్న స్క్రీన్‌గ్రాబ్‌లో, డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఫుడ్ ఆర్డర్‌తో లొకేషన్‌లో ఉన్నట్లు మెసేజ్ చేశాడు. "మీతో తీసుకెళ్ళి లంచ్ ఎంజాయ్ చేయండి. నేను నా అడ్రస్ మార్చుకోవడం మర్చిపోయాను మరియు ప్రస్తుతం మేరీల్యాండ్‌లో ఉన్నాను" అని డేవిస్ స్పందించాడు.


డెలివరీ డ్రైవర్ అతనికి కృతజ్ఞతలు తెలిపాడు  "నేను మీకు మళ్లీ కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. ఈ రోజు నా సోదరుడి పుట్టినరోజు ఈ ఫుడ్ నేను తనతో కలిసి తినబోతున్నాను. ఈ విషయం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది,. చాలా థ్యాంక్స్’ అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. 

click me!