వాలంటైన్స్ డే... గూగుల్ స్పెషల్ డూడుల్...!

Published : Feb 14, 2023, 09:40 AM IST
 వాలంటైన్స్ డే... గూగుల్ స్పెషల్ డూడుల్...!

సారాంశం

పింక్ కలర్ లో యానిమేటేడ్ డూడుల్ చాలా క్యూట్ గా... చూడగానే ముచ్చటేసేలా ఉంది. వర్షపు చినుకులతో దీనిని తయారు చేయడం విశేషం. రెండు వర్షపు చినకులు కలిసి... హృదయాకార సింబల్ గా మారుతూ ఉంది.  

గూగుల్... స్పెషల్ డేస్ ని ప్రత్యేకమైన డూడుల్ తయారుచేస్తూ ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఈరోజు వాలైంటైన్స్ డే కావడంతో... స్పెషల్ డూడుల్ తయారు చేసింది. పింక్ కలర్ లో యానిమేటేడ్ డూడుల్ చాలా క్యూట్ గా... చూడగానే ముచ్చటేసేలా ఉంది. వర్షపు చినుకులతో దీనిని తయారు చేయడం విశేషం. రెండు వర్షపు చినకులు కలిసి... హృదయాకార సింబల్ గా మారుతూ ఉంది.

 

‘Rain or shine, will you be mine?’ అనే కొటేషన్ తో... ప్రపంచ వ్యాప్తంగా వాలంటైన్స్ డే జరుపుకుంటున్నవారికి గూగుల్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సంవత్సరంలోని మోస్ట్ రొమాంటిక్ డేని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు గూగుల్ డూడుల్  ద్వారా... తమ ప్రేమికులు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ... గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది.

 

బ్యాగ్రౌండ్ మొత్తం పింక్ కలర్ లో ఉంది.  వెనక గూగుల్ అని రాసి ఉంది. మొత్తం వర్షం చినుకులు ఉన్నాయి. వాటిలో రెండు వర్షపు చినుకులు మాత్రం కదులుతూ కనిపిస్తున్నాయి.  ముందుగా ఒక వర్షం చినుకు కిందకు రాలింది. ఆ వెంటనే మరో వర్షపు చినుకు కూడా... దాని దగ్గరకు వచ్చి కలిసింది. రెండూ కలిసి... సంతోషంగా నవ్వుతున్న... హార్ట్ ఎమోజీ గా మారింది. ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్
Viral Video: ఇదేందయ్య‌ ఇది.! సెక్యూరిటీకే సెక్యూరిటా.. వీడియో చూస్తే ప‌డి ప‌డి న‌వ్వాల్సిందే