ఈ పాము వీడియో చూస్తే.. వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి..!

Published : Jan 25, 2022, 01:28 PM IST
ఈ పాము వీడియో చూస్తే..  వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి..!

సారాంశం

 ఆ వీడియోలో పాము.. గోడపైకి పాకుతూ కనపడుతుంది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా.. వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

పాము అంటే భయపడేవారు చాలా మందే ఉంటారు.  అక్కడెక్కడో పాము కనిపడిందంటే.. అంత దూరం పరిగెడతాం. ఇక ఆ పాము మన ఇంట్లోకి వస్తే.. మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు నిజంగా పాము అంటే భయం ఉంటే.. ఈ వీడియో చూస్తే.. మీకు వెంట్రుకలు నిక్క పొడుచుకోవడం ఖాయం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఆ వీడియోలో పాము.. గోడపైకి పాకుతూ కనపడుతుంది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా.. వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

పెద్ద పాము.. కాస్త లావుగానే కనపడుతోంది.. ఓ గోడ మీదకు ఎక్కుతూ.. పాకుతూ కనపడింది. ఆ తర్వాత.. అది చెట్లల్లోకి వెళ్లిపోయింది. మొత్తం 58 సెకన్లు ఈ వీడియో ఉంది. పాము చాలా పొడవుగా ఉన్నట్లు కనపడుతోంది. పాము పై గోడమీదకు వెళ్లే సమయానికి అక్కడకు ఓ పిల్లి రావడంవ గమనార్హం.  ఆ పాముని చూసి పిల్లి పారిపోతుందేమో అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. ఆ పిల్లి పారిపోకుండా.. రెప్పకూడా కొట్టకుండా ఆ పామునే చూస్తూ ఉండిపోయింది. అది కూడా వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

ఈ వీడియో వైరల్‌హాగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో ఈ నెలలో చోటుచేసుకుంది. “పాము ఇంత ఎత్తుకు ఎక్కుతుందని నేను నమ్మలేకపోయాను” అని క్యాప్షన్ ఉంది. కాగా.. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ రావడం గమనార్హం. కాగా.. నెటిజన్లు ఎక్కువగా.. పాము పొడవు... భయపడిపారిపోకుండా అక్కడే ఉన్న పిల్లి గురించే ఎక్కువగా కామెంట్స్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్