2007 నాటి ఓ యాపిల్ ఐ ఫోన్ వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలయ్యి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కొన్ని వస్తువులు పాతబడినా కొద్దీ విలువ పెరిగిపోతూ ఉంటుంది. అలా ఓ ఐ ఫోన్ కూడా పదహారేళ్ల తర్వాత ఊహించని ధరకు అమ్ముడుపోయింది. 2007లో విడుదలైన ఫస్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్ ఒకరు కొన్నారు. కానీ దాన్ని సీలు కూడా విప్పలేదు. పదహారేళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని వేలానికి పెట్టారు. 2007లో 599 డాలర్లకు ఆ ఫోన్ ను కొనుగోలు చేశారు. ఈ ఫోన్లో తాజాగా వేలం వేయగా వచ్చిన సొమ్ము కళ్ళు చెదిరేలా ఉంది. ఈ ఫోన్ ఏకంగా రూ.52 లక్షలకు అమ్ముడు పోయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఎల్ సిజి హౌస్ అనే అమెరికాకు చెందిన ఓ కంపెనీ వేసిన వేలంపాటలో.. పాత ఫోన్లు సేకరించేవారు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
2007లో ఫస్ట్ జనరేషన్ కు సంబంధించిన ఐఫోన్ కావడం.. ఇంకా సీలు కూడా తీయకుండా అలాగే ఉండడంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర విపరీతంగా పెరిగిపోయింది. వేలం వేసే ముందు దీనికి ఒక 50,000 డాలర్లు మాత్రమే వస్తాయని కంపెనీ అంచనా వేసింది. కానీ కంపెనీ అంచనాలను తలకిందులు చేస్తూ.. అందరూ ఆశ్చర్యపోయేలా ఏకంగా ఈ ఫోన్ 63 వేల డాలర్లు రాబట్టింది. ఈ ఫోన్ ఎక్కడిది అంటే.. ఈ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ను పదహారేళ్ల క్రితం టాటూ ఆర్టిస్ట్ కరెన్ గ్రీన్ కు తన స్నేహితులు గిఫ్ట్ గా ఇచ్చారు. కొత్త ఉద్యోగం వచ్చిన సందర్భంగా 2007లో కరెన్ స్నేహితులు ఆమెకు ఇలా సర్ప్రైజ్ చేశారు.
undefined
అయితే, కరెన్ దీనిని వాడలేదు. కనీసం ప్యాకింగ్ కూడా తీయకుండా అలాగే జాగ్రత్తగా దాచి పెట్టింది. అంతకు ముందు వాడుతున్న మామూలు ఫోన్ నే వాడింది. దీనికి ఒక కారణం ఉంది. స్మార్ట్ ఫోన్ కు మారాలంటే ఏ టీ అండ్ టీ నెట్వర్కు మారాల్సి ఉంటుంది. అలా మారడం కరెన్ కు ఇష్టం లేదు. దాంతో ఆ స్మార్ట్ ఫోన్ వాడకుండా అలాగే దాచిపెట్టింది. తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు అనుకుందో.. అమ్మేయొచ్చు అనుకుందో తెలియదు.. కానీ బాక్స్ సీలు కూడా విప్పకుండా చాలా జాగ్రత్తగా పెట్టింది. అలా రోజులు గడిచిన కొద్ది దాని సంగతి కూడా మర్చిపోయింది. అయితే, కొద్ది కాలం కిందట పాత మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు పెద్దగా వాడుకలో లేనివి సీల్ తీయకుండా ఉన్న ఫోన్లు అయితే వాటికి ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయని స్నేహితులకు చెప్పగా వినింది.
ఫ్లిప్ కార్ట్ చేసిన తప్పుకు ఎగిరి గంతేసిన కస్టమర్.. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే.. వచ్చింది చూసి.....
అప్పుడు ఆమెకు ఈ స్మార్ట్ ఫోన్ గుర్తుకు వచ్చింది. తను భద్రంగా దాచిపెట్టిన ఫోను బయటికి తీసింది. 2019లో ‘ ద డాక్టర్ అండ్ దివా షో’ ద్వారా ఈ ఫోన్ విలువ ఎంత ఉంటుందో తెలుసుకుంది. దాని విలువ 5000 డాలర్ల వరకు ఉంటుందని వారు అంచనా వేశారు. వెంటనే వేలం నిర్వహకులను కరెన్ సంప్రదించింది. ఈ క్రమంలోనే ఎల్సిజి ఆక్షన్స్ అనే కంపెనీ వెబ్సైట్లో ఫిబ్రవరి 2న ఫోన్ వేలానికి పెట్టారు. ఈ ఫోన్ను బట్టి దానికి ఒక 50,000 డాలర్ల వరకు వస్తాయని కంపెనీ అంచనా వేసింది.
కానీ వారు ఊహించని విధంగా ఆ ఫోన్ కు డిమాండ్ పెరుగుతూ పోయింది. వేలంలో ప్రారంభ ధర 2,500 డాలర్లుగా నిర్ణయించారు. కానీ 27 బిడ్ ల తర్వాత దాని ధర అనూహ్యంగా పెరిగి… 63వేల 356.40 డాలర్లు వచ్చాయి. 599 డాలర్లకు కొన్న ఫోన్ ధర 16 ఏళ్లలో 63 డాలర్లకు చేరడంతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ స్మార్ట్ మొబైల్ 2జి నెట్వర్క్ తోనే పని చేస్తుంది. దీంట్లో ఎయిట్ జిబి స్టోరేజీ, 3.5 ఇంచుల డిస్ప్లే, 2 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.