ఆ ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి పక్షమే...: ఎమ్మెల్యే ధర్మశ్రీ వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Jan 27, 2020, 5:14 PM IST
Highlights

శాసనమండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు శాసనసభకు రాకపోవడాన్ని వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యతిరేకించారు. వారి వాదన అంత బలమైనదే అయితే అసెంబ్లీ ద్వారా దాన్ని  ప్రజలకు తెెలియజేయాల్సిందని అన్నారు.

అమరావతి: సోమవారం శాసనమండలి రద్దుకు సంబంధించి కేబిజెట్ ఆమోదించిన తీర్మానంపై శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు... ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షం టిడిపిని బిఎసి మీటింగ్ కు రావాలని కోరినట్లు వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ తెలిపారు. అయితే శాసనసభలో చర్చకు దూరంగా వుంటామని టిడిపి నాయకులు చెప్పారని... ఇప్పుడేమో తమకు సమాచారమే ఇవ్వలేదంటూ నాటకాలు ఆడుతున్నారని అన్నారు.  ఎక్కడొ దాక్కుని అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా అందుకు తామే కారణమని నిందవేయడం తగదన్నారు. 

ప్రజాస్వామ్యంను పరిరక్షించే విధంగా శాసనసభలో  వారి వాదనలు వారు... తమ వాదనలు తాము ప్రజలకు వినిపిద్దామని అన్నామన్నారు. కానీ అందుకు టిడిపి సుముఖంగా లేకపోగా తిరిగి తమపైనే నిందలు వేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే ధర్మశ్రీ.. 

ప్రజా ప్రయోజనాలు కలిగిన బిల్లును జాప్యం చేసేందుకు శాసనమండలిలో నాటకాలు ఆడారని విమర్శించారు. తాము చేస్తున్న వాదనను మరింత బలంగా వినిపించేందుకు టిడిపి శాసనసభకు రావాలన్నారు. 

read more  వారి స్వార్థం కోసమే పెద్దల సభ... జాతీయ నాయకులు వద్దన్నా...: ధర్మాన

గతంలో ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా శాసనమండలిని చంద్రబాబు విమర్శించలేదా? అని ప్రశ్నించారు. ఆనాడు శాసనసభ ఒక్కటే సరిపోతుందని స్పష్టంగా చెప్పారన్నారు. గతంలో మండలి రద్దు సందర్భంగా ఎన్టీ రామారావు, వెంకయ్యనాయుడులు ఏం మాట్లాడారో కూడా చర్చిద్దామని అన్నారు. 

చంద్రబాబు ఎవరిమీద అలిగి శాసనసభకు రావడం లేదో అర్ధం కావడం లేదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించడం లేదుని  అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన భయపడుతున్నాడని...అందువల్లే ఆ బిల్లును ఎలాగయినా అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. 

చంద్రబాబు నాటకాలను బట్టబయలు పెట్టడానికి ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు.  శాసనమండలి వ్యవస్థ అవసరమా? కాదా? అనే విషయాన్ని ఆధారాలతో సహా ప్రజలు ముందు పెడతామన్నారు. చంద్రబాబుకు రెండు నాలుకలు, రెండు కళ్ళ సిద్దాంతం అలవాటయ్యిందని విమర్శించారు. అసెంబ్లీలో చర్చ ద్వారా చంద్రబాబు వైఖరిని ఎండగడతామన్నారు.

అయిదుగురు ఉత్తరాంధ్ర టిడిపి సభ్యులు వికేంద్రీకరణకు అనుకూలంగా వున్నారని...తమ ప్రాంతం అభివృద్థి చెందాలని వారు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టిడిపి లాగా వేరే పార్టీ నుండి గెలిచిన వారిని పశువుల్లా కొనే అలవాటు వైఎస్ జగన్ కు లేదన్నారు. అదే వైఖరికి అప్పుడు, ఇప్పుడు కట్టుబడి వున్నామన్నారు. నిజంగా తామే టిడిపి సభ్యుల  చేరికలను ప్రోత్సహిస్తే ఆ పార్టీలో ఎవ్వరూ మిగలరని అన్నారు. 

టిడిపి నాయకులకు దమ్ము, ధైర్యం వుంటే శాసనసభలో మండలి రద్దుపై చర్చకు రావాలన్నారు. ఆరోజు జాతీయ పార్టీగా వున్న కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనమండలిని తీసుకువచ్చారని.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆమోదించారన్నారు. 

read more  మండలి కాదు అసెంబ్లీని కూడా రద్దుచేయాలి...అప్పుడు 3 కాదు 30..: అచ్చెన్నాయుడు సవాల్

రాష్ట్రం విడిపోయిన తరువాత పరిశీలిస్తే మండలిలో సభ్యులుగా టిడిపి నాయకులతో నింపేశారన్నారు.  మేధావులకు బదులు పార్టీ అవసరాల కోసం సభ్యులకు చంద్రబాబు అవకాశం కల్పించారన్నారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులు వుండాల్సిన మండలిలో పార్టీ నేతలు కొలువు తీరారని... వీటన్నింటిపైనా చర్చింద్దాం... ప్రతపక్షంగా టిడిపి సభకు హాజరుకావాలని ధర్మశ్రీ పేర్కొన్నారు. 
 

click me!