విజయవాడలో అర్థరాత్రి అలజడి... ఓ కుటుంబంపై కర్రలు, కారంతో దాడి

Arun Kumar P   | Asianet News
Published : May 09, 2020, 11:41 AM IST
విజయవాడలో అర్థరాత్రి అలజడి... ఓ కుటుంబంపై కర్రలు, కారంతో దాడి

సారాంశం

పాతకక్షల నేపథ్యంలో అధికార వైసిపి నాయకుడొకరు తన ప్రత్యర్థిపై దాడికి పాల్పడిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: పాతకక్షల నేపధ్యంలో ఓ కుంటుంబంపై ప్రత్యర్థులు గొడ్డుకారం, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో శుక్రవారం అర్థరాత్రి అలజడి సృష్టించింది. 

ఈ దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ టిడిపి నాయకులు ఖుర్షీద్ కు రాజేశ్వరి నగర్ లో నివాసముండే  సుభానీకి పాతకక్షలు వున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం అర్థరాత్రి ఖుర్షీద్ తన అనుచరులతో కలిసి సుభానీ  ఇంటిపై దాడి  చేశారు. ఇంట్లోవున్న సుభానీని ఇంట్లోంచి బయటకు లాగి కర్రలు, కారంతో దాడిచేశారు. అడ్డువచ్చిన వచ్చిన మహిళలపై కూడా విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుభానీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే వుంది. 

ఈ దాడిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పాత కక్షలు నేపధ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌