వీఆర్ వివాదం... వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్

By Arun Kumar PFirst Published Feb 6, 2020, 3:51 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు మరోసారి టిడిపి నాయకులు వర్ల రామయ్యపై తీవ్ర స్ధాయిలో  విరుచుకుపడ్డారు. 

అమరావతి: బుధవారం టిడిపి నాయకులు వర్ల రామయ్య పోలీస్ లపై చేసిన వ్యాఖ్యలను ఏపి పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు  ఖండించారు. ఆయన ఓ కులం పేరును ప్రస్తావిస్తూ వీఆర్ లకు పోస్టింగ్ ఇవ్వండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని కూడా తప్పుబట్టారు. ఆయనకు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని శ్రీనివాసరావు మండిపడ్డారు. 

గతంలో పోలీస్ అధికారిగా... ఈ సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా వర్ల రామయ్య పనిచేశారని తెలిపారు. అలాంటిది గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన పోలీస్ అధికారుల సంఘానికి ఏం చేశారో చెప్పాలన్నారు. సామాజిక వర్గాన్ని తెరపైకి తెచ్చి ఆయన పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ కించపరుస్తున్నారని అన్నారు.

read more  రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం ముమ్మాటికీ తప్పే...: ఆళ్ల రామకృష్ణారెడ్డి

టిడిపి హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు పోలీసులకు బస్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరామని... దాన్ని ఆయన పట్టించుకోలేదన్నారు. అలాగే పోలీస్ హౌసింగ్ నుండి ఇంటి ఫ్లాట్స్ ఇప్పించమని కోరితే ఏం చేశారని నిలదీశారు. 

పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షునిగా అధికారుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని శ్రీనివాసరావు వెల్లడించారు. తమంతట తాము పనిచేసుకుంటుంటే రామయ్య ప్రతిసారీ తమను రాజకీయాల్లోకి లాగడం బాగోలేదన్నారు.  

విఆర్ లో ఉన్న వారిని నైపుణ్యత ప్రకారం విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎ వ్యవస్థలో అయినా అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయన్నారు. బయట నుండి రాళ్లు వేసే ఆయనలాంటి వాళ్లకు ఏమి తెలుస్తుందని విమర్శించారు. 

read more  రాజధాని మహిళలను గోళ్లతో రక్కి, గిచ్చి...పోలీసుల కర్కశత్వం...: వర్ల రామయ్య

ఇప్పటికే పోలీసుల సమస్యలపై పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. వెంటనే పోలీస్ అధికారుల సంఘంపై చేసిన వ్యాఖ్యలను వర్ల రామయ్య వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. 

click me!