బెజవాడలో దారుణం: నర్సుపై కారు డ్రైవర్ అత్యాచారం

By telugu team  |  First Published Sep 30, 2019, 8:31 AM IST

విజయవాడలో ఓ కార్పోరేట్ ఆస్పత్రి స్టాఫ్ నర్సుపై కారు డ్రైవర్ అత్యాచారం చేశాడు. అతని బెదిరింపులకు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనపై విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. 

మొవ్వకు చెందిన ఓ యువతి విజయవాడలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమె తన అన్నయ్యతో కలిసి గుణదలలో నివాసం ఉంటోంది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వినోద్ అనే వ్యక్తి ఆమెపై గత నెల 4వ తేదీన ఇంట్లోనే అత్యాచారం చేశాడు. 

Latest Videos

ఆ విషయాన్ని బయటకు చెప్తే మీ అన్నయ్యను చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ బెదరింపులను తట్టుకోలేక మన్తాపానికి గురైన యువతి ఈ నెల 26వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

స్థానికులు ఆమెను కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!