జగన్ కు రివర్స్ టెండరింగ్ ద్వారానే బుద్దిచెప్పేది... అదెలాగంటే: వంగవీటి రాధ

By Arun Kumar PFirst Published Jan 27, 2020, 5:37 PM IST
Highlights

రాజధాని  మార్పు,  మండలి రద్దు వంటి ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సీఎం జగన్ కు ప్రజలు ఆయన  స్టైల్లోనే బుద్దిచెప్పడం ఖాయమని టిడిపి నాయకులు,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ హెచ్చరించారు. 

అమరావతి: ఏపీ పభుత్వానికి కౌన్సిల్ రద్దు చేసే అధికారం లేదని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. పెద్దల సభ అనేది సలహాలు, సూచనలు ఇస్తుంది... అలాంటి సభను రద్దు చేయడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ అంటే ఏంటో సీఎం జగన్, మంత్రులు ముందు తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 

ఇక రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుబడుతూ... అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం జగన్ ఎక్కడ నుండి పరిపాలన చేశాడని ప్రశ్నించారు. ఇంతకాలం పరిపాలన విషయంలో ఆయనకు ఎమయినా అసౌకర్యం కలిగిందా అని అడిగారు. రాజధాని అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలన్నారు. 

ఆ ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి పక్షమే...: ఎమ్మెల్యే ధర్మశ్రీ వ్యాఖ్యలు

తన తండ్రి, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేసిన జగన్ రాజధాని కోసం 30 మంది చనిపోతే ఎందుకు ఓదార్పు యాత్ర చేయడంలేదని నిలదీశారు. ఇప్పుడు ఇంతమంది రోడ్డుపై కూర్చుంటే సీఎం జగన్ కాదు కదా కనీసం వైసిపి ఎమ్యెల్యేలు కూడా పరామర్శించలేదని విమర్శించారు.

జగన్ మొత్తం రివర్స్ టెండరింగ్ లో వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక సారి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు కూడా రివర్స్ టెండరింగ్ లో బుద్ధి చెబుతారని వంగవీటి రాధ విమర్శించారు.

మండలి కాదు అసెంబ్లీని కూడా రద్దుచేయాలి...అప్పుడు 3 కాదు 30..: అచ్చెన్నాయుడు సవాల్

అమరావతిలో రాజధాని నిర్మాణం వలన భవిష్యత్ తరాలు నష్టపోతారు అని సీఎం జగన్ అంటున్నారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతి రైతుల త్యాగాలను హేళన చేస్తున్నాడని విమర్శించారు. రాజధాని కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఒక కులానికో, వర్గానికో  అంటగడుతూ నిర్వీర్యం  చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాధ ఆరోపించారు. 

click me!