పశు సఖి మహిళల తరపున పోరాటానికి సిద్దం...: లోకేశ్

By Arun Kumar P  |  First Published Oct 16, 2019, 4:14 PM IST

పశు సఖి మహిళా ఉద్యోగాలకు తెలుగు దేశం పార్టీ అండగా వుంటుందని మాజీ మంత్రి  నారా లోకేశ్ ప్రకటించారు. వారికోసం వైఎస్సార్‌సిపి ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమేనని లోకేశ్  తెలిపారు.  


గుంటూరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ని  పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్న పశు సఖి మహిళలు కలిశారు.నాలుగు నెలల నుండి తమకు జీతాలు రావడం లేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  

మహిళా పశు సఖి వర్కర్స్ లో6400 మంది ఉద్యోగాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన  తమ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అందరిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని  ఆరోపించారు. 

Latest Videos

undefined

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నాలు, ర్యాలీలు చేసినా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పశు సఖులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రి మా సమస్యలను వినకపోగా వెళ్లి కూలీ పని చేసుకోండి అంటూ అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. కాబట్టి మా పోరాటానికి అండగా ఉండాలని లోకేశ్ ని   పశు సఖులు కోరారు.

కనీసం సమస్య వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి, మంత్రులకు లేకపోవడం దురదష్టకరమని లోకేశ్ అన్నారు. ఈ మహిళల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ తరపున అండగా నిలబడతానని ప్రకటించారు. 

కేవలం వీరిని మాత్రమే వివిధ స్థాయిల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు మరికొందరిని తొలగించేందుకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని లోకేశ్ ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

ఇప్పటికే అంగన్వాడీ,ఉపాధి హామీ ,పశు సఖులు, ఆశా వర్కర్లు ఇలా ఎంతో మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన వారందరిన తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా మీకు అండగా ఉంది పోరాటం చేస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. 
 

click me!