గుమ్మడిలా కనిపించాలనుకుంటారు.. లోపల రాజనాలే: మంత్రులపై మంతెన ఫైర్

By Siva Kodati  |  First Published Nov 17, 2019, 5:02 PM IST

బందిపోట్ల కంటే ప్రమాదకరంగా వైకాపా మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌ లు పోటీపడుతున్నారని ఆయన ఆరోపించారు. 


బందిపోట్ల కంటే ప్రమాదకరంగా వైకాపా మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌ లు పోటీపడుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంతెన ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడుపై అవినీతి ముద్ర వేయటం మీ తరం కాదని.. మంత్రులు వ్యవహరిస్తున్న తీరు, వాడుతున్న భాషను చూసి బజారు రౌడీలు కూడా ఆశ్చర్యపోతున్నారని సత్యనారాయణ రాజు సెటైర్లు వేశారు.

Latest Videos

undefined

డ్రైనేజీకి మంత్రుల మాటలకు తేడా లేకుండా పోయిందని.. వైకాపా నాయకులకు మూటలు, ప్రజలకు వాతల్లా ఈ ఆరు నెలల పనితీరు ఉందన్న మంతెన రాష్ట్ర ప్రజలు వీరిని ఎన్నటికీ క్షమించరన్నారు.

Also Read:అయప్ప మాలలో ఉండి కూడా వంశీ, అవంతీ చెప్పులేసుకుంటారు:వర్ల

కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌లు సినిమాల్లో గుమ్మడిలా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ లోపల మాత్రం విలన్‌ రాజనాల అన్న విషయం బయటపడిందని మంతెన సెటైర్లు వేశారు.

ఇసుక కొరతతో 30 లక్షల మంది కార్మికులు రోడ్డున పడితే కొరత లేదని, ఎక్కడా అక్రమాలు జరగలేదని అవంతి దుష్ప్రచారం చేస్తున్నారని సత్యనారాయణరాజు మండిపడ్డారు. ఇసుక అక్రమాలు నిరూపిస్తే మంత్రి రాజీనామాకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.

పర్యాటక రంగాన్ని గాలికొదిలేసి దుష్ప్రచార రంగానికి ఫుల్‌టైమ్‌ మంత్రిగా అవంతి శ్రీనివాస్‌ పనిచేస్తున్నారని మంతెన ధ్వజమెత్తారు.  నైతిక విలువలు లేకుండా అవంతి వ్యవహరిస్తున్నారని సత్యనారాయణ రాజు విమర్శించారు.

మరో నేత వర్ల రామయ్య .. వంశీ వాఖ్యలపై ఘాటుగా స్పందించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... వంశీ అయ్యప్పమాల వేసుకుని అలాంటి మాటలు మట్లాడకూడదు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. కానీ తప్పుగా మాట్లాడకూడదు ఆయన మనసును కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారు.

Also read:వల్లభనేని వంశీ వ్యూహం ఇదే: అదే జరిగితే చంద్రబాబుకు పెద్ద దెబ్బ

వంశీ,మంత్రి అవంతీ అయ్యప్పమాలలో ఉండి కూడా చెప్పులేసుకుంటారు. హైందవ ధర్మాన్ని అగౌరవ పరచి ఏం మెసేజ్ సమాజానికి ఇస్తున్నారు. లోకేష్ ను అన్న అన్న అని ఇప్పుడు గున్న అంటున్నాడు. వంశీ వల్లభనేని వంశీమోహన్ కి ఇదే ఫైనల్ వార్నింగ్, జగన్ తో కలిసి తప్పుడు మాటలు మాట్లాడాకు" అంటూ తీవ్ర స్ధాయిలో వంశీపై విరుచుకుపడ్డారు.

మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా వంశీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్రాలు  సందించారు. "వంశీ నేను ఒకే సారీ రాజకీయాలలోకి వచ్చాము..నేను మచిలీపట్నం ఎంపీగా ఎన్నకయ్యాను దురదృష్టవ శాత్తు వంశీ ఓడిపోయాడు.

ఆ తర్వాత 2014లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎనవనికయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పడు పార్టీని విమర్శించటం.. మంచిది కాదు..ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై విమర్శలు చేయటం తగదు..రాజేంద్రప్రసాద్ రాజకీయాలలో కి రాక ముందే సర్పంచల సంగం రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసారు.

click me!