దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే అది మీరే...: విజయసాయిపై బుద్దా ఫైర్

By Arun Kumar P  |  First Published Oct 23, 2019, 3:46 PM IST

అధికార వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. విజయసాయిని శకుని మామా అని సంబోధిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా సంచలన కామెంట్స్ చేశారు. 


విజయవాడ: వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డిని విమర్శిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేస్తున్న ట్వీట్ల పరంపర ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విజయసాయి రెడ్డిని శుకుని మామ అని, సీఎం జగన్ ను తుగ్లక్ అని సంబోధిస్తూ వెంకన్న ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలా  గతకొద్దిరోజులగా ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఇవాళ( బుధవారం) మరోసారి ట్విట్టర్ వేదికన  రెచ్చిపోయారు. మరోసారి విజయసాయిరెడ్డి, జగన్ పై ఘాటు విమర్శలకు దిగారు. ''దరిద్రానికి ప్యాంటు,షర్టు వేస్తే మీలా ఉంటుంది @VSReddy_MP గారు. ఇక మీ తుగ్లక్ ముఖ్యమంత్రి @ysjagan దరిద్రానికి బ్రాండ్ అంబాసిడరని కొత్తగా చెప్పక్కర్లేదు. అడుగుపెట్టాకా రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసా రెడ్డిగారు. బోట్ ముంచి 56 మంది అమాయకులని మింగేసారు, 256 రైతుల్ని మింగేసారు.''

Latest Videos

''విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారం చేసారు.  30 లక్షలమంది భవననిర్మాణ కార్మికులని రోడ్లపై నిలబెట్టారు. డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు, అన్నక్యాంటీన్ మూసేసి పేద వాడి పొట్ట కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డిఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు సాయి రెడ్డి గారు!!''  

''@VSReddy_MP గారూ, మీవాడు ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడన్నావ్. కానీ మీవాడు రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు దమ్ముంటే తుగ్లక్ ముఖ్యమంత్రి @ysjaganతో రాజీనామా చేయించి రాష్ట్రంలో ఎక్కడనుంచైనా పోటీ చేయించు, తేలిపోతుంది ప్రజలు ఎవరిని తిరిగి కోరుకుంటున్నారో!!'' అని వెంకన్న ద్వజమెత్తారు.

గతంలో కూడా వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ  బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు. '' రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే రాష్ట్ర ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని మామా?అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగేసి రాష్ట్ర ఖజానా నింపుతాం అన్నారుగా  నువ్వు,మీ తుగ్లక్  గుర్తుందా?''  

''తీరా మీకు 22 ఎంపీలని ఇస్తే రాష్ట్రం కోసం పోరాడాల్సింది మానేసి  మీ కేసుల మాఫీ కోసం వంగి వంగి దండాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేసారు కదా శకుని మామా ! పైగా రాష్ట్ర ఆర్ధిక స్థితి అప్పులు అంటూ మంగళవారం కబుర్లోకటి !! ''

 ''మడమ తిప్పామ్,  మాట మార్చామ్ అని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే, మీ మహమేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు గారి చేసిన అప్పులు సృష్టించిన సంపద పై నీతో చర్చకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా శకుని మామా ?'' అంటూ వరుస వెంకన్న వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

click me!