తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మరిపించేందుకు జగన్ మరింత దుర్మార్గంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.
గుంటూరు: సీఎం జగన్మోహన్‌రెడ్డి పరిపాలన గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారనేదాని గురించి స్వయంగా ఆయన కేబినెట్‌లోని మంత్రే వాస్తవాలు వెల్లడించారని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రజల మనస్సుల్లో ఉన్న అభిప్రాయాలనే సదరు మంత్రి తన నోటిద్వారా వెల్లడించారని అన్నారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి పరిపాలనను మర్చిపోయేలా జగన్ ఎలా పాలిస్తున్నాడో, ఎన్ని ఆకృత్యాలు చేస్తున్నాడో స్వయంగా రాష్ట్రమంత్రే చెప్పినట్లుగా సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను విలేకరులకు ప్రదర్శించిన ఉమా దానిపై మీడియాకు వివరణ ఇచ్చారు.
ప్రజల మనస్సుల్లో ఉన్నదే మంత్రి నోటినుంచి వచ్చిందని, రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో ఏం దుర్మార్గం జరిగిందో, దాన్ని మర్చిపోవడానికి జగన్మోహన్‌రెడ్డి ఎన్ని దుర్మార్గాలు, అరాచకాలు చేస్తున్నాడో ఆ వీడియోలో స్పష్టంగా సరిపోలాయని దేవినేని స్పష్టం చేశారు. వైఎస్ పాలనలో జరిగిన చండాలం, దోపిడీ, అవినీతి కార్యక్రమాలు మళ్లీ ప్రజలకు గుర్తొచ్చేలా సదరు మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
undefined
పిచ్చోడి చేతిలో రాయిలా అధికారాన్ని ఉపయోగిస్తున్న జగన్ తండ్రి కోరిక తీర్చడం కోసం 8నెలల్లోనే చేయాల్సిన దుర్మార్గమంతా చేశాడని ఉమా మండిపడ్డారు. 34వేల ఎకరాలిచ్చిన రైతులు, రైతు కూలీలను 32 రోజులుగా వేధిస్తున్న జగన్ తన తండ్రి ఆత్మశాంతికోసం ఇవన్నీ చేస్తున్నాడని ఆరోపించారు. తండ్రి చేసినదానికన్నా ఎక్కువ దుర్మార్గాలు చేయాలన్న ఆలోచన జగన్లో కనిపిస్తోందని, రైతులు చనిపోయినా ఒక్కరోజుకూడా వారి మరణాలగురించి మాట్లాడకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
అమరావతి ప్రాంత రైతుల మరణాల పై స్థానిక శాసనసభ్యులు, హోంమంత్రి, డిప్యూటీ సీఎంలు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. దున్నపోతు ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే రైతులు సెల్‌టవర్ ఎక్కి చావుకు సిద్ధపడ్డారని ఉమా తెలిపారు.
read more అమరావతి ఉద్యమంలో మరో విషాదం... రాజధాని కోసం ఆగిన మరో గుండె
తనతండ్రి పేరు నిలబెట్టడానికి జగన్ ఇంకెన్ని అరాచకాలు చేస్తాడో, ఎందర్ని బలితీసుకుంటాడో చూడాలన్నారు. రాజధాని తరలిపోతుంటే సిగ్గులేకుండా ప్రదర్శనలు చేయడం వైసీపీవారికే సాధ్యమైందన్నారు. అమరావతి కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిని, పోలవరం పనుల్ని ముఖ్యమంత్రి కాగానే జగన్ నిలిపివేశాడని, దానివల్ల లక్షలకోట్ల ఆదాయం తరలిపోయిందన్నారు.
జగన్ సీబీఐ కేసులుచూసే నిరంజన్‌రెడ్డి కార్యాలయంలో సీఆర్డీఏ యాక్ట్‌కి సంబంధించిన బిల్లులు, అసెంబ్లీలో చర్చకు వచ్చే బిల్లులు, చట్టాలు తయారవుతున్నాయని దేవినేని ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ ముందు నోరెత్తలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రశ్నించేవారిపై కేసులుపెడుతూ, రాజధాని రైతులపై సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేస్తూ బాధ్యతగల అధికారులతో కోర్టుకి తప్పుడు సమాచారం ఇప్పిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా అమరావతి కోసం ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారని, స్వచ్ఛందంగా చంద్రబాబుకి విరాళాలు ఇస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు.తనపై బురదజల్లుతూ జగన్ పైశాచికానందం పొందుతున్నాడని అన్నారు. ఎవరో ఎక్కడో పొలంకొంటే దాన్ని తనకు ఆపాదిస్తూ సాక్షిలో పిచ్చిరాతలు రాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడురాతలతో బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడేవారిని న్యాయస్థానాలకు ఈడుస్తానని ఆయన హెచ్చరించారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌లో తనపేరు లాగిన జగన్ చివరకు తప్పుడు కథనాలతో సాక్షి పత్రికలో తనపై విషం చిమ్మడానికి సిద్ధమయ్యాడన్నారు.
అమరావతి జేఏసీ పిలుపుమేరకు 20వ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జగన్ పక్కరాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం సొంతరాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి రియల్‌ఎస్టేట్ వ్యాపారం కోసం పెద్దఎత్తున భూముల ఆక్రమణలకు తెరలేపాడన్నారు. క్రిస్టియన్ సంస్థల భూములు, వివాదాల్లో ఉన్నభూములు కాజేసేందుకు అధికారుల్ని పావులుగా వాడుకుంటున్నారని ఉమా పేర్కొన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా ఏదైనా పనిచేసేముందు జగన్, విజయసాయిల మాటలు నమ్మి కోర్టులచుట్టూ తిరుగుతున్న శ్రీలక్ష్మిని స్మరించుకోవాలని, ఆమె ఫొటోను తమబల్లలపై పెట్టుకోవాలని ఉమా హితవుపలికారు. 2012నుంచి ఈనాటికీ ఆమెకు పోస్టింగ్‌లేదని, ఢిల్లీలో అధికారులచుట్టూ తిరుగుతున్న ఆమెదైన్యాన్ని రాష్ట్ర అధికారులంతా గుర్తుచేసుకోవాలన్నారు.
read more ఇన్ సైడ్ ట్రేడింగ్... సర్వే నంబర్లతో సహా వారి బాగోతం బయటపెడతా: వైసిపి ఎమ్మెల్యే
జగన్ ఉద్దరిస్తాడని రహస్య జీవోలపై సంతకాలు చేసే అధికారులు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారులందర్నీ కోర్టులకు ఈడుస్తామని హెచ్చరించారు. తన అవినీతి బురదని అధికారులకు, తమలాంటి నాయకులకు అంటించడం కోసం జగన్ తాపత్రయపడుతున్నాడన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాటలువిని మహిళలపై లాఠీఛార్జి చేసిన పోలీసులంతా హైకోర్టుముందు దోషులుగా నిలబడ్డారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. క్షుద్ర పూజలుచేసే స్వామీజీ మాటలు వినే జగన్ విశాఖకు పరిగెత్తుతున్నాడన్నాడని దేవినేని ఉమ విమర్శించారు.