రెండు గంటలుగా పాటు ఏకధాటిగా కుండపోతగా వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా మామిడి, వరి పంట రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. పత్తి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజోన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మండలంలోని పలు గ్రామాలలో తెల్లవారు జామున 4గంటలు నుండి భారీ ఉరుములతో కూడిన కుండ పోతవర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు ఆగకుండా వర్షం కురిసింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం తో పాటు గాలి కూడా బలంగా వీయడంతో... విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
రెండు గంటలుగా పాటు ఏకధాటిగా కుండపోతగా వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా మామిడి, వరి పంట రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. పత్తి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజోన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల మొక్కజొన్న పంట కండెలు విరగదీసి కల్లాల్లో ఉన్న పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
గత నెల రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయని.. దంతో పత్తి చేలు నీట మునిగిపోయాయని.. మొక్కలు మునిగిపోయానని వారు చెబుతున్నారు. దీంతో ఈ సంవత్సరం పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు చెబుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమకు సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు.