వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

Published : Sep 17, 2019, 03:36 PM ISTUpdated : Sep 17, 2019, 03:54 PM IST
వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

సారాంశం

కృష్ణా జిల్లా గన్నవరంలో మంగళవారం నాడు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.దీంతో విమానాల ల్యాండిగ్ కు అంతరాయం ఏర్పడింది.

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో ఈదురుగాలులతో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో విమానాల ల్యాండింగ్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే వాతావరణం లేకపోవడంతో విమనాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

హైద్రాబాద్ నుండి విజయవాడకు  ఓ ప్రైవేట్ విమానం మంగళవారం నాడు గాల్లోనే చక్కర్లు కొట్టింది.ఈ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఉన్నారు.మంగళవారం నాడు హైద్రాబాద్- విజయవాడ వెళ్లే విమానం  గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యే వాతావరణ పరిస్థితులు లేని కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టింది.

హైద్రాబాద్- విజయవాడకు వెళ్లే విమానం ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే విమానంలో హైద్రాబాద్ నుండి విజయవాడకు వైఎస్ విజయమ్మ  బయలుదేరారు.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌