గ్రామాల్లో పర్యటిస్తా... ప్రజలు ఎవరైనా చెయ్యెత్తితే....: అధికారులకు జగన్ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jan 28, 2020, 4:28 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం అమలుతీరుపై ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అమరావతి: సచివాలయంలో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ లు పాల్గొన్నారు.  స్పందన కింద వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 60శాతం వరకూ బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయని సీఎం తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కారం అయ్యేలా సంబంధించి అధికారులు బాగా పనిచేశారంటూ అధికారులను సీఎం ప్రశంసించారు. 

ఇకపై దరఖాస్తులకు సంబంధించిన కార్డులు జారీచేయాల్సి ఉందని.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొత్తంగా 54.64 లక్షలకు పైగా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఎన్నికలకు 6 నెలల ముందు పెన్షన్లు 39 లక్షలు ఉండేవని...ఇప్పుడు 54లక్షలకు పైబడి ఇస్తున్నాన్నారు. పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి డోర్‌డెలివరీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.

read more  కొంచెం ఓపికపట్టివుంటే అక్కడా జగన్ బలం పెరిగేది...: గంటా శ్రీనివాసరావు

గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించి అర్హుల జాబితాలను డిస్‌ప్లే చేశారా? లేదా? అని కలెక్టర్లతో ఆరా తీశారు సీఎం. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కొత్త పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డుల పంపిణీ చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. ఆ సమయానికి కార్డులన్నింటినీ ప్రింట్‌ చేసి పంపిణీకి సిద్ధంచేయాలని అధికారులను సూచించారు. 

సోషల్‌ఆడిట్‌ కోసం 

పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులకు దరఖాస్తు చేసుకువారి వివరాలను సోషల్‌ ఆడిట్‌ పూర్తిచేసి ఫిబ్రవరి 2 కల్లా పంపించాలని సీఎం సూచించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 కల్లా కొత్త కార్డులను పంపిణీ చేస్తామన్నారు. ఇది పూర్తయిన తర్వాత అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నా. వారికి కొత్తకార్డులు గ్రామ సచివాలయాల ద్వారా రొటీన్‌గా మంజూరుచేయడం జరుగుతుందన్నారు.

 ఇళ్లపట్టాలు:

ఉగాదినాటికి ఇళ్లపట్టాలు మంజూరుకు సిద్దంగా వుండాలని సీఎం ఆదేశించారు. 25 లక్షలమందికి మహిళల పేర్లమీద 10 రూపాయల స్టాంపు పేపర్ల మీద ఇళ్లపట్టాలు వుండనున్నట్లు  తెలిపారు. అర్హుల జాబితాలను సోషల్‌ఆడిట్‌ కోసం డిస్‌ప్లే చేశారా లేదా? అని ఆరాతీశారు. మిస్‌ అయినవారు ఎవరికి దరఖాస్తు చేయాలన్నా అందుకు సంబంధించిన వివరాలు కూడా గ్రామ సచివాయాల్లో డిస్‌ ప్లే చేశామని అధికారులు సీఎంకు తెలిపారు.

లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల  స్థలాల కేటాయింపు వుంటుందన్నారు. ఫిబ్రవరి 15లోగా ఇళ్లపట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రజా సాధికార సర్వేకూ.. ఇళ్లపట్టాల మంజూరుకు  లింకు పెట్టకూడదన్నారు. ఎవరికైనా ఇళ్లు ఇచ్చి ఉంటే 2006 నుంచి ప్రభుత్వం వద్ద డేటా ఉందన్నారు. కేవలం ఆ డేటాతో మాత్రమే చెక్‌ చేసుకోవాలన్నారు. 

read more  చైనా నుండి భారత్ కు కరోనా వైరస్... ఏపిలో హై అలర్డ్...: మంత్రి ఆళ్ల నాని

తాను గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఈ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే ఎవరు చెయ్యెత్తకూడదన్నారు. ఎవరివల్లకూడా అన్యాయం జరిగిందన్న మాట రాకూడదని...ఇళ్లపట్టాలు ఇవ్వదలచుకున్న స్థలాలను ఖరారు చేసేముందు లబ్ధిదారుల్లో మెజార్టీ ప్రజలు దీనికి అంగీకారం తెలపాలన్నారు. మొక్కుబడిగా ఇచ్చామంటే ఇచ్చినట్టుగా ఉంటే ఎవ్వరూ కూడా ఆ స్థలాల్లో ఉండటానికి ఇష్టపడరని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే ఇళ్లస్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలని అధికారులకు సీఎం సూచించారు. ఇళ్ల స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలని.... లబ్ధిదారుడు సంతోషంగా ఉంటామనే సుముఖత వ్యక్తంచేయాలని...అలా కాకపోతే డబ్బు వృథా, లబ్ధిదారులకు అసంతృప్తే మిగులుతుందన్నారు. ప్లాటింగ్‌ చేసేటప్పుడు ఈ అంశాలను ఖచ్చితంగా కలెక్టర్లు పరిశీలించాలన్నారు. ఊరుకు చాలా దూరంలోనూ, నివాసానికి ఉపయోగంలేని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.

విద్యా వసతి దీవెన

ఫిబ్రవరి 28న విద్యా వసతి దీవెన ప్రారంభంచేసి మొదటి విడత, జులై–ఆగస్టులో రెండో విడత నిర్వహించాలని ఆదేశించారు. బోర్డింగు, లాడ్జింగు ఖర్చులకు ఈ డబ్బు తల్లులకు ఇస్తున్నట్లు...దాదాపు 11 లక్షల మందికిపైగా పిల్లలకు ఇది ఇస్తున్నమన్నారు. జగనన్న విద్యా  వసతి కింద ఐటిఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులకు ఏడాదికి రూ.20వేలుఇవ్వనున్నట్లు తెలిపారు. 

రైతు భరోసా కేంద్రాలు

రైతు భరోసా కేంద్రాల ద్వారా మనదైనముద్ర వేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల దగ్గరకే రైతు భరోసా కేంద్రాలు వుండాలని...ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అదికారులకు సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్టు ఇదని...నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామస్థాయిలో రైతులకు అందిస్తామన్నారు. రైతు పంటవేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామన్నారు. 

 

click me!