గంజాయి మత్తు... జామెట్రి బాక్స్ లోని పరికరంతో ప్రాణ స్నేహితుడిపై దాడి

Arun Kumar P   | Asianet News
Published : Nov 16, 2020, 07:53 AM ISTUpdated : Nov 16, 2020, 08:24 AM IST
గంజాయి మత్తు... జామెట్రి బాక్స్ లోని పరికరంతో ప్రాణ స్నేహితుడిపై దాడి

సారాంశం

గంజాయి మత్తులో విచక్షణను మరిచి తన ప్రాణ స్నేహితుడిని కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించాడో మైనర్ బాలుడు.

విజయవాడ: ప్రమాదకరమైన గంజాయికి బానిసయిన ఓ మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ మత్తులో విచక్షణను మరిచి తన ప్రాణ స్నేహితుడిని కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన విజయవాడ సమీపంలో చోటుచచేసుకుంది. 

క కృష్ణా జిల్లా రామవరప్పాడు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన సురేంద్ర(21)కు 16 ఏళ్ల ఓ బాలుడు స్నేహితులు. గతంలో ఒకే దగ్గర పనిచేయడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం ఇద్దరూ ఇంటిదగ్గరే ఖాళీగా వుంటూ చెడు వ్యసనాలకు బానిసయ్యారు. 

ఈ క్రమంలోనే ఆదివారం వీరిద్దరు కలిసి మద్యం సేవించడమే కాకుండా గంజాయిని కూడా తాగడంతో మత్తులోకి వెళ్లిపోయారు. ఈ మత్తులో మైనర్ బాలుడికి సురేంద్రకు మద్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో  బాలుడు కోపంతో తన వద్దగల జామెట్రి బాక్స్ లోని ఓ పదునైన పరికరంతో సురేంద్ర గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో సురేంద్ర  అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

రక్తం మడుగులో పడివున్న సురేంద్రను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన బాలుడు ప్రస్తుతం పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌