మహిళను విచక్షణారహితంగా పొడిచి చంపిన తాగుబోతు

Published : Nov 14, 2020, 11:21 AM IST
మహిళను విచక్షణారహితంగా పొడిచి చంపిన తాగుబోతు

సారాంశం

విజయవాడలోని రెడ్డిగారితోటలో దారుణమైన హత్య జరిగింది. మద్యం, గంజాయి మత్తులో ఓ యువకుడు ఓ మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణమైన హత్య జరిగింది. ఓ మహిళను ఓ యువకుడు రెండు కత్తులతో విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. 

రక్తస్రావం తీవ్రంగా జరగడంతో ఆమె మృత్యుకౌగిట్లోకి వెళ్లిపోయింది. నిందితుడు హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కుమారుడితో కలిసి నిత్యం మద్యం సేవిస్తుండడంతో ఆమె మందలించినట్లు తెలుస్తోంది. అలా మద్యం సేవించకూడదని చెప్పినందుకు విజయవాడలోని రెడ్డిగారి తోటకు చెందిన మహిళను అతను హత్య చేశాడు.

హత్య చేసిన సమయంలో నిందితుడు మద్యం మాత్రమే కాకుండా గంజాయి కూడా సేవించి ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ మత్తులోనే మహిళను అతను హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య ఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Free Bus Scheme : మహిళలకే కాదు ఇక ఈ మగవాళ్లకూ ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?