కౌలుదారుల చట్టాన్ని రైతులు గౌరవించాలి: పిల్లి సుభాష్ చంద్రబోస్

By Arun Kumar P  |  First Published Oct 14, 2019, 7:16 PM IST

రాష్ట్ర ప్రభుత్వ  నూతనంగా తీసుకువచ్చిన కైలుదారి చట్టాన్ని ప్రతిఒక్కరు గౌరవించాలని సహకరించాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు.  


అమరావతి: ప్రభుత్వం కౌలుదారు రైతుల సంక్షేమం కోసం రూపొందించిన కౌలుదారి చట్టాన్ని ప్రతిఒక్కరు గౌరవించాలని డిప్యూటి సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. అటు భూయాజమాన్యం కలిగిన రైతులు ఇటు కౌలుదారులు ఇద్దరికీ న్యాయం జరిగేలా చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు. 

ఇప్పటికీ కొందరు రైతులు కౌలుదారులకు గుర్తింపు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. కౌలుదారులు కూడా తమవంటి రైతులేనని సదరు భూయజమానులు గుర్తించాలని సూచించారు. 

Latest Videos

భూ యజమానులు, కౌలుదారుల హక్కులను కాపాడేలా ఈ కౌలుదారి చట్టం రూపొందించామన్నారు. భూ రికార్డుల్లో కౌలుదారు పేరు ఎక్కడా నమోదు కాదు.  కాబట్టి భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగలదని వివరించారు. కాబట్టి ఈ చట్టం అమలయ్యేలా రైతులు సహకరించాలని కోరారు.

గతంలో ఈ కౌలుదారు చట్టం సరిగా లేకపోవడంతో చాలా మంది రైతులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వలస వెళ్లారు. కౌలుదారులకు నష్టం చేకూరితే మొట్ట మొదట నష్టపోయేది రైతేనని అందరు గుర్తుపెట్టుకోవాలన్నారు. కాబట్టి రైతులు కౌలుదారుల హక్కులను గుర్తించి వారికి సహకరించాలని మంత్రి  కోరారు. 

click me!