బందరు మండలం మంగినపూడిలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కోరారు మచిలీపట్నం జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ.
బందరు మండలం మంగినపూడిలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కోరారు మచిలీపట్నం జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ.
ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన గమిడి సోమేశ్వరరావు కుటుంబానికి సోమవారం జనసేన పార్టీ తరఫున బండి రామకృష్ణ, లంకిశెట్టి బాలాజీ ,వి. చౌదరి, గడ్డం రాజు 10.000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. గ్రామస్తులు అందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో కుల మత పార్టీ రహితంగా అందరూ ముందుకు రావాలని నియోజవర్గ సమన్వయ కమిటీ సభ్యులు వి. చౌదరి, గడ్డం రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.